Rashmika Ban: కన్నడలో రష్మిక మందన్నపై నిషేధం.. ఆ వివాదానికి అదే సరైన సమాధానం.. దీక్షిత్ శెట్టి

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై పాపులర్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్ఫణలో నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ది గర్ల్‌ఫ్రెండ్. విద్య కొప్పినీడు, ధీరజ్ మొగిలినేని నిర్మించిన ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రంలో దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి, అను ఇమ్మాన్యుయేల్, రావు రమేష్, రోహిణి తదితరులు నటించారు.

ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వహబ్ మ్యూజిక్ అందించారు. ప్రశాంత్ ఆర్ విహారీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫిని, చోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా, రామకృష్ణ, మోనిక ప్రొడక్షన్ డిజైనర్లుగా వ్యవహరించారు. ఈ సినిమా నవంబర్ 7వ తేదీన గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విజయవంతంగా దూసుకుపోవడంతోపాటు భారీగా కలెక్షన్లను రాబడుతున్నది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఈ చిత్రంలో విక్రమ్ పాత్రలో జీవించిన దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ.. రష్మికపై కన్నడలో కొనసాగుతున్న బ్యాన్ గురించి తనదైన శైలిలో స్పందించారు. ది గర్ల్ ఫ్రెండ్ మూవీ, రష్మికపై నిషేధం గురించి ఆయన ఏమన్నారనే వివరాల్లోకి వెళితే..

Ban on Rashmika Mandanna

ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా వినోదం మాత్రమే కాకుండా ఫ్యామిలీ, మహిళలకు సంబంధించిన విషయాలపై ఆలోచన రేకిస్తుంది. సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. కేవలం సినిమా గానే కాకుండా ఓ ఫీలింగ్‌లా ఆడియెన్స్ మనసులో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఈ సినిమా తప్పుకుండా హృదయాన్ని తట్టి లేపుతుంది అని దీక్షిత్ శెట్టి తెలిపారు.

ది గర్ల్‌ఫ్రెండ్ సినిమాలో చాలా బలమైన అంశాలు ఉన్నాయి. మూవీ చూసిన తర్వాత ప్రేక్షకుల దృక్పథం మారుతుంది. ఇది ప్రత్యేకమైన సినిమా. మంచి అనుభూతిని పంచుతుంది. నేను పోషించిన పాత్ర విషపూరితమైన ప్రేమికుడా? లేదా మంచి ప్రేమికుడా అనేది సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు. నేటితరం బంధాలపై యూత్‌కు చక్కటి అవగాహన కల్పించే చిత్రంగా మిగులుతుంది అని దీక్షిత్ శెట్టి చెప్పారు.

కన్నడ పరిశ్రమలో రష్మిక మందన్నపై అనధికార నిషేధం గురించి దీక్షిత్ స్పందించారు. కాలంతోపాటు వివాదాలు సద్దుమణుగుతాయి. ఇలాంటి వివాదాలకు కాలమే జవాబు చెబుతుంది. రష్మికది కష్టపడి పనిచేసే తత్వం. ఆమెలోని ప్రతిభనే ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. ఇలాంటి వివాదానికి రష్మిక పని సరైన సమాధానంగా నిలుస్తుంది. ఆమె మాటలకంటే తెరమీద ఆమె సాధించే విజయాలు గట్టిగా మాట్లాడుతాయి అని దీక్షిత్ శెట్టి అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X