For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Puneeth Rajkumar జిమ్ చేస్తూ చనిపోలేదు.. ముందు రోజు ఏం జరిగిందంటే?.. క్లారిటీ ఇచ్చిన హీరో శ్రీకాంత్

  |

  కన్నడ సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా ఎంతగానో క్రేజ్ అందుకున్నటువంటి పునీత్ రాజ్ కుమార్ శుక్రవారం రోజు గుండెపోటుతో మరణించడం సినీ ప్రపంచాన్ని ఒక్కసారిగా అంధకారంలోకి నెట్టివేసింది. బుధవారం రోజు సరదాగా అన్నయ్యతో కలిసి సినిమా ఈవెంట్ లో కనిపించిన పునీత్ హఠాత్తుగా అలా కన్నుమూయడం ఎవరికి అంతు పట్టడం లేదు. ఎల్లప్పుడూ చిరునవ్వుతో కనిపించే పునీత్ రాజ్ కుమార్ మృతిచెందాడని తెలుసుకున్న అభిమానులు అలాగే సినీ ప్రముఖులు కూడా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

  అంతటి మంచి వ్యక్తి ఇంత త్వరగా వెళ్లి పోవడం నిజంగా ఎంతగానో బాధకు గురి చేస్తోందని ప్రతి ఒక్కరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా మంచి అనుబంధం ఉండడంతో చాలా చాలామంది తెలుగు సినీ ప్రముఖులు కడసారి చూసేందుకు బెంగుళూరుకు వెళ్లారు. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ తో పాటు శ్రీకాంత్ కూడా కలిసి వెళ్లారు. అయితే పునీత్ రాజ్ కుమార్ అంత హఠాత్తుగా చనిపోవడానికి గల కారణాలపై తెలుగు హీరో శ్రీకాంత్ కూడా ఒక వివరణ ఇచ్చాడు.

   మంచి నటుడిగా..

  మంచి నటుడిగా..

  పునీత్ రాజ్ కుమార్ అంటే తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు. కేవలం కన్నడ ఇండస్ట్రీ లోనే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రముఖులకు కూడా ఆయన చాలా సన్నిహితుడు. పునీత్ తండ్రి రాజ్ కుమార్ కూడా మంచి నటుడిగా ఎంతగానో గుర్తింపును అందుకున్నారు. ఇక ఆయన వారసుడిగా కన్నడ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అతి తక్కువ కాలంలోనే బాల నటుడిగా కూడా మంచి పేరు సంపాదించాడు. ఆ తర్వాత అప్పు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తన స్థాయిని మరింత పెంచుకున్నాడు. ఆ సినిమాను పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేశాడు. అదే ఇడియట్ కథ.

  పేదవారి కోసం అండగా..

  పేదవారి కోసం అండగా..

  పునీత్ రాజ్ కుమార్ అంటే అభిమానులు ఎంత ఇష్టపడతారో ఆయన అంతిమయాత్రను చూస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది. కేవలం హీరోగానే కాకుండా మంచి మనసున్న వ్యక్తిగా కూడా ఈ స్టార్ హీరో మంచి గుర్తింపును అందుకున్నాడు. సంపాదించిన వాటిలో చాలావరకు ఇతర సామాజిక సేవా కార్యక్రమాల కోసం ఉపయోగిస్తూ వస్తున్నాడు. ఎంతోమంది పేద విద్యార్థులకు అండగా నిలుస్తూ ఉచితంగా చదివిస్తున్నాడు. అంతేకాకుండా పేద కళాకారులకు కొంతమంది అనాధలకు కూడా ఆశ్రమాలను కట్టించాడు.

  కారణం ఏమిటి?

  కారణం ఏమిటి?

  నాలుగు పదుల వయసులోనే పునీత్ మంచి నటుడిగా గుండెపోటుతో మరణించడం ఓ వర్గం వారికి ఎంతగానో కలిచివేసింది. ఇక ఆయన మృతిపై అనేక రకాలు కథనాలు వెలువడుతున్నాయి. కొంత కన్ఫ్యూజన్ కూడా నెలకొంది. పునీత్ జిమ్ చేస్తూ చనిపోయాడు అంటూ చాలా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటికే వైద్యులు కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. పునీత్ రాజ్ కుమార్ తో జేమ్స్ సినిమా లో నటించిన శ్రీకాంత్ కూడా ఆయన మృతిపై ఒక వివరణ ఇచ్చారు.

  పునీత్ తో సినిమా..

  పునీత్ తో సినిమా..

  శ్రీకాంత్ మాట్లాడుతూ.. పునీత్ రాజ్ కుమార్ మరణించాడు అనే వార్త ఎంతగానో కలిచివేసింది. ఆయన లేడు అంటే నమ్మలేక పోతున్నాను వారి కుటుంబంతో నాకు మంచి సాన్నిహిత్యం ఉంది. పునీత్ రాజ్ కుమార్ తో కలిసి నేను జేమ్స్ అనే సినిమాను కూడా చేశాను. ఆ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక సినిమా షూటింగ్ లో భాగంగా పునీత్ రాజ్ కుమార్ తో నేను దాదాపు 40 రోజుల పాటు ట్రావెల్ చేశాను. కానీ తక్కువ టైమ్ లోనే అతని మంచితనం ఏమిటో నాకు చాలా ఈజీ గా అర్థమైంది.. అని అన్నారు.

  నాకు బాడీగార్డ్ పాత్రలో..

  నాకు బాడీగార్డ్ పాత్రలో..

  ప్రతి ఒక్కరిని కూడా ఎంతగానో గౌరవించి మాట్లాడతారు పేద ధనిక అనే బేధం అసలు చూపించరు. ఇక తోటి నటీనటులకు కూడా ఆయన ఎలాంటి భేదం లేకుండా గౌరవిస్తారు. నేను సినిమా షూటింగ్ లో పాల్గొన్నప్పుడు కూడా ఆయన నన్ను చాలా ప్రత్యేకంగా చూశారు. ఇక ఇంటి నుంచి భోజనం తెప్పించుకునే పునీత్ రాజ్ కుమార్ అందరికీ అదే తినిపించేవారు. ఎంత ఆలస్యం అయినా కూడా ఇంటి భోజనాన్ని మాత్రమే తినేవారు. పబ్లిసిటీ లేకుండా చాలామందికి హెల్ప్ చేశాడు. జేమ్స్ సినిమాలో నేను ఒక ఫ్యామిలీ విలన్ కాగా అతను నాకు ఒక బాడీ గార్డ్ పాత్రలో నటిస్తున్నాడు.. అని శ్రీకాంత్ అన్నాడు.

  Recommended Video

  Puneeth Rajkumar Biography.. Appu అజరామరం.. తండ్రిలాగే కళ్ళు దానం ! || Filmibeat Telugu
  అసలు కారణం ఇదే..

  అసలు కారణం ఇదే..

  పునీత్ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. ఎప్పుడు చూసినా కూడా చాలా పాజిటివ్ గా ఫిట్ గా కనిపిస్తూ ఉంటాడు. అయితే పునీత్ రాజ్ కుమార్ జిమ్ చేస్తూ చనిపోయాడు అంటూ అనేక రకాల వార్తలు వచ్చాయి. అతను జిమ్ లోనే చనిపోయాడని కూడా అంటున్నారు. కానీ అందులో ఎలాంటి నిజం లేదు. అసలు చనిపోయే ముందు వరకు కూడా అతను జిమ్ చేయలేదు.

  రాత్రి కొంత అస్వస్థతకు గురయ్యాడు. ఉదయం కొంత నీరసంగా అనిపించడంతో వెంటనే ఫ్యామిలీ డాక్టర్ ను కలిశాడు. ఆ తర్వాత విక్రమ్ హాస్పిటల్ కు కూడా తీసుకువెళ్లారు. అయితే హార్ట్ ఎటాక్ తో చనిపోవడం అనేది వారి కుటుంబ సభ్యులలోనే ఉంది.

  తండ్రి రాజ్ కుమార్ కూడా గుండెపోటుతో మరణించారు. అతని సోదరుడు శివరాజ్ కుమార్ కూడా ఇదివరకే గుండెపోటుకు గురయ్యారు. అలాగే పునీత్ కి కూడా సడన్ గా స్ట్రోక్ రావడంతోనే కన్నుమూశారు.. అని శ్రీకాంత్ వివరణ ఇచ్చారు.

  English summary
  Tollywood actor sreekanth about Puneeth Rajkumar behind death reason
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X