Rave Party: హేమ అరెస్ట్ వెనుక అసలు కారణం అదేనట.. డ్రగ్స్ వినియోగం కేసులో కాకుండా.. సరికొత్త ట్విస్టు!

బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ కేసు కీలక మలుపు తీరిగింది. గత కొద్ది రోజులుగా వస్తున్న ఊహాగానాలకు అనుగుణంగానే సినీ నటి హేమను కర్ణాటక సెంట్రల్ క్రైమ్ విభాగం పోలీసులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకొని బెంగళూరుకు తరలించారు. అయితే ఈ కేసులో హేమ పాత్రకు సంబంధించిన అనేక కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యాపారవేత్త బర్త్ డే సందర్బంగా మే 19వ తేదీన బెంగళూరు నిర్వహించిన డ్రగ్స్ పార్టీలో హేమ కీలకంగా వ్యవహరించిందనే విషయం వెల్లడైంది. దాంతో ఆమెను సంఘటనా స్థలంలో అదుపులోకి తీసుకొని వైద్య పరీక్షలు నిర్వహించగా.. హేమతోపాటు 86 మందికి పాజిటివ్‌గా తేలిసంది. దాంతో హేమ డ్రగ్స్ వినియోగించిందనే విషయం స్పష్టమైంది.

Twist in Bangalore Rave Party Hema will produced in Court on June 4th

ఆ తర్వాత బెంగళూరు పోలీసులు హేమకు మూడుసార్లు నోటీసులు జారీ చేయగా.. ఆమెకు వాటికి స్పందించకపోవడంతో నేరుగా పోలీసులు రంగంలోకి దిగారు. హైదరాబాద్‌లో సోమవారం ఉదయం ఆమెను అదుపులోకి తీసుకొన్ని బెంగళూరకు తరలించారు.

అనంతరం ఆమెను ప్రశ్నించిన తర్వాత అరెస్ట్ చేస్తున్నట్టు చెప్పి ఏరియా హాస్పిటల్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రధానంగా డ్రగ్స్ వినియోగం కేసులో కాకుండా.. రేవ్ పార్టీని నిర్వహించిన ఆరోపణలపై హేమను అరెస్ట్ చేసినట్టు తెలుస్తున్నది. దాదాపు హేమతోపాటు ఐదుగురు పార్టీని నిర్వహించారనే విషయం బయటకు వచ్చింది.

Twist in Bangalore Rave Party Hema will produced in Court on June 4th

ఈ కేసులో అరెస్ట్ చేసిన తర్వాత సోమవారం రాత్రి హేమను బెంగళూరు స్టేట్ హోమ్‌లో ఉంచుతారు. అనంతరం ఆమెను మంగళవారం కోర్టులో హాజరుపరుస్తారు అని మీడియా కథనాలు వెల్లడించాయి. ఇప్పటికే ఈ కేసులో మరో నలుగురిని అరెస్ట్ చేయడం గమనార్హం.

బెంగళూరు కోర్టులో హాజరుపరిచిన తర్వాత హేమను 5 రోజులపాటు పోలీసులు తమ కస్టడీని కోరే అవకాశం ఉంది. ఈ విచారణలో ఈ వ్యవహారంలో ఆమెకు కీలక పాత్ర ఉందని తేలితే భారీగా శిక్షపడే అవకాశం ఉందని పోలీసులు వెల్లడిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X