ఘోరంగా ఉద్ఘార్షణ ఫస్ట్ లుక్.. యువతి తొడలు దారుణంగా చూపిస్తూ!
కొన్ని చిత్రాలు ప్రారంభం నుంచే ఓ వర్గం ప్రేక్షకులని ఆకర్షిస్తాయి. వాటి ప్రమోషన్ కార్యక్రమాలు కూడా అదేవిధంగా విభిన్నంగా ఉంటాయి. ప్రముఖ కన్నడ దర్శకుడు సునీల్ కుమార్ దేశాయ్ కొంత గ్యాప్ తరువాత తెరకెక్కిస్తున్న చిత్రం ఉద్ఘార్షణ. టైటిల్ తోనే ఇదొక థ్రిల్లర్ చిత్రం అని తెలిసిపోతోంది.
తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ భయంకరంగా ఉంటూ ఆకట్టుకుంటోంది. ఓ యువతి తొడలని రక్తపు మరకలతో ఘోరంగా చూపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో త్రిభాషా చిత్రంగా ఉద్ఘార్షణ రూపొందుతోంది.

నటి సాయి ధన్శిక ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. డి క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఆ శక్తి రేకెత్తిస్తోన్న ఈ థ్రిల్లర్ చిత్రం ఏ అంశం గురించి అనే ఉత్కంఠ రేగుతోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబందించిన మరిన్ని విశేషాలు తెలియనున్నాయి.


Click it and Unblock the Notifications











