Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
KGF Chapter 2లో అదిరిపోయే వాటర్ సీక్వెన్స్: ఆ పది నిమిషాలు అరాచకమేనట
2021లో ఎన్నో పాన్ ఇండియా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇందులో దేశంలోని అన్ని ఇండస్ట్రీలకు చెందిన ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో 'KGF Chapter 2' ఒకటి. స్టైలిష్ హీరో యశ్ - టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందిన 'KGF Chapter 1'కు సీక్వెల్‌గా వస్తోందీ చిత్రం. మూడేళ్ల క్రితం ప్రేక్షకుల ముందకు వచ్చిన ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ సూపర్ డూపర్ హిట్ అయింది. అప్పుడు ఇండియన్ సినిమాపై తీవ్ర స్థాయిలో ప్రభావం చూపుతూ.. రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించింది.
మొదటి భాగం ఊహించని స్థాయిలో విజయాన్ని అందుకోవడంతో 'KGF Chapter 2'పై ఆరంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఆ మధ్య విడుదలైన టీజర్ వాటిని రెట్టింపు చేసేసింది. ఈ వీడియో ఇండియన్ సినిమా హిస్టరీలో సరికొత్త చరిత్రను లిఖించుకుంది. దీంతో ఈ మూవీపై దేశ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు దృష్టి సారించారు. దీంతో బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరుగుతోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల హక్కులు అమ్ముడైపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రతిష్టాత్మక చిత్రం గురించి తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.
తాజా సమాచారం ప్రకారం.. 'KGF Chapter 2'లో ఓ అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్స్ ఉందట. దాదాపు పది నిమిషాల పాటు ఉండే ఈ సీన్ అరాచకంగా రూపొందించారని తెలుస్తోంది. ఇంటర్వెల్‌కు ముందే వచ్చే ఈ ఫైట్ మాస్ ఆడియెన్స్‌ను కట్టిపడేస్తుందని అంటున్నారు. ఇదిలా ఉండగా, హొంబళే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ విలన్‌గా చేస్తున్నారు. ఆయనతో పాటు ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక, ఈ సినిమా జూలై 16న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.