twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జీరో నుంచే మొదలయ్యా, పాలిటిక్స్ వ్యాపారం చేశారు, అందుకే పార్టీ పెట్టా: ఉపేంద్ర

    |

    విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కన్నడ స్టార్ ఉపేంద్ర త్వరలో 'ఐ లవ్ యూ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కన్నడ-తెలుగు బై లింగువల్ సినిమాకు చంద్రు దర్శకత్వం వహించారు. తాజాగా తెలుగు టీజర్ విడుదల చేశారు.

    ఉపేంద్ర గత సినిమాల స్టైల్‌లోనే ఈ చిత్రం ఉండబోతోందని తెలుస్తోంది. ప్రేమ, కామం ఆ దేవడి నాటకం అనే కాన్సెప్టుతో ఈ చిత్రం తెరకెక్కించినట్లు తెలుస్తోంది. సినిమా ప్రమోషన్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపేంద్ర మాట్లాడుతూ... సినిమాలో చాలా ఆసక్తికర విషయాలు ఉన్నాయి, అవి చెప్పడం కన్నా చూస్తేనే బావుంటాయి. దర్శకుడు చంద్రు అద్భుతంగా తీశారు అని తెలిపారు.

    ఈ సందర్భంగా ఉపేంద్ర తన సినిమా, పొలిటికల్ కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    జీరో నుంచే మొదలయ్యాను

    జీరో నుంచే మొదలయ్యాను

    జీరో నుంచే నేను మొదలయ్యాను. చాలా మంది అలాగే స్టార్ట్ అయ్యారు. జీరోలో ఉన్న ప్లస్ ఏమిటంటే.. నథింగ్ లెస్‌లో ఎవ్రీథింగ్ ఉంది. మీ దగ్గర ఏమీ లేదంటే అప్పుడు క్రియేటివిటీ మొదలవుతుంది. ఒక పెద్ద హీరోతో నా ఫిల్మ్ స్టార్ట్ చేసి ఉంటే హీరో గురించి వస్తారు అని నా ఎఫర్ట్ కొంచెం తక్కువ చేసేవాడినేమో?... అని ఉపేంద్ర వ్యాఖ్యానించారు.

    ఎక్కువ ప్రయత్నం చేయడానికి జీరోనే కారణం

    ఎక్కువ ప్రయత్నం చేయడానికి జీరోనే కారణం

    చిన్న బడ్జెట్.. కొత్తవారితో సినిమా చేస్తే టైటిల్ ఇంపార్టెంట్, పోస్టర్ డిజైన్ ఇంపార్టెంట్, సినిమాలో ఒక్క సీన్ కూడా బోర్ కొట్టకూడదు, ఎంగేజింగ్ గా ఉండాలి, ప్రేక్షకులు చూసి వెళ్లిన తర్వాత సినిమా గురించి మాట్లాడాలి.. ఇలా ఎక్కువ ప్రయత్నం చేయడానికి జీరోనే కారణం అయిందన్నారు.

    పాలిటిక్స్ అంటే బిజినెస్ అయిపోయింది

    పాలిటిక్స్ అంటే బిజినెస్ అయిపోయింది

    తర్వాత జీరో నుంచే పొలిటికల్ పార్టీ మొదలు పెట్టాను. ఇది క్యాష్ లెస్ పార్టీ. మనకు క్యాషే సమస్య అయింది. పాలిటిక్స్ అంటే బిజినెస్ అయిపోయింది. హెల్త్, ఎడ్యుకేషన్ అన్నీ బిజినెస్ అవుతోంది. కేవలం 20 శాతం ఉన్న వ్యక్తులు 80 శాతం అమయాకులను రూల్ చేస్తున్నారు.

    అందుకే జీరో నుంచే పొలిటికల్ పార్టీ మొదలు పెట్టాను

    అందుకే జీరో నుంచే పొలిటికల్ పార్టీ మొదలు పెట్టాను

    అందుకే జీరో నుంచే పొలిటికల్ పార్టీ మొదలు పెట్టాను. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ఎలా? ఎలా పని చేస్తాం. ఎలా మనం ప్రజలకు టచ్ లో ఉంటాం. ఇలాంటివన్నీ ప్లాన్ చేసి పార్టీ మొదలు పెట్టాం. దయచేసి అందరి ఆశీర్వాదం, సపోర్ట్ కావాలి.. అని ఉపేంద్ర చెప్పుకొచ్చారు.

    ‘ఐ లవ్ యూ' టీజర్

    ఐలవ్ యూలో ఉపేంద్ర, రచిత రామ్, సోను గౌడ, బ్రహ్మానందం ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆర్ చంద్రు దర్శకత్వం వహించారు.

    English summary
    Upendra About His Political Party and I Love You Movie. “I Love U” Written & Directed by R Chandru. Starring: Real Star Upendra, Dimple Queen Rachita Ram, Sonu Gowda, Brahmanandam.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X