బంపర్ ఆఫర్ కొట్టేసిన రావు రమేష్.. సెన్సేషనల్ ప్రాజెక్ట్‌లోకి..

టాలీవుడ్‌లో ప్రతిభవంతులైన నటుల్లో రావు రమేష్ ఒకరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తన తండ్రి, ప్రముఖ నటుడు రావు గోపాలరావు నట వారసత్వాన్ని పుచ్చుకొని టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. గత రెండు దశాబ్దాలకుపైగా రావు రమేష్ అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకులను రంజింప చేస్తున్నారు. తాజాగా సెన్సేషనల్ ప్రాజెక్ట్ కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రంలో ఓ కీలక పాత్రను దక్కించుకోవడం విశేషం.

కేజీఎఫ్2 చిత్రంలో రావు రమేష్ నటిస్తున్నారనే విషయాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ స్వయంగా ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. రావు రమేష్ సార్‌ను కేజీఎఫ్2 ప్రాజెక్ట్‌లోకి ఆహ్వానించడం గొప్పగా ఉంది. ఎలాంటి పాత్రను చేస్తున్నారనే విషయాన్ని ప్రేక్షకులకు వదిలివేస్తున్నాను. ఆయన పాత్రను తెరపైనే చూసి సర్‌ప్రైజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాం. ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం అయినందుకు రావు రమేష్‌కు థ్యాంక్స్ అంటూ ప్రశాంత్ నీల్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Versatile actor Rao Ramesh into KGF Chapter 2

అంతేకాకుండా బహుభాషా చిత్రంగా రూపొందుతున్న కేజీఎఫ్2 చిత్రంలో బాలీవుడ్ నటి రవీనా టాండన్‌ను కూడా ఓ కీలక పాత్రకు తీసుకొన్నట్టు ప్రశాంత్ నీల్ ఆదివారం ట్విట్టర్ ద్వారా ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇక ఇదిలా ఉండగా, ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన కేజీఎఫ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెన్సేషనల్ విజయాన్ని అందుకొన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో కేజీఎఫ్ రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాకుండా కన్నడ పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కూడా చరిత్ర సృష్టించింది.

Versatile actor Rao Ramesh into KGF Chapter 2

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X