KGF డైలాగ్‌తో అదరగొట్టిన సెహ్వాగ్: శివాజీ కోసం ఆ సినిమాను వాడిన క్రికెటర్

ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చినా.. దేశ వ్యాప్తంగా ఇంపాక్ట్ చూపించిన చిత్రాలు చాలా తక్కువే ఉంటాయి. అందులో మూడేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'KGF Chapter 1' ఒకటి. స్టైలిష్ హీరో యశ్ - టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో వచ్చిన ఈ కన్నడ సినిమా.. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ విడుదలైంది. అన్ని చోట్లా సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది. అంతేకాదు, యాక్షన్ విభాగంలో జాతీయ అవార్డును సైతం అందుకుంది. దీంతో దీనికి సీక్వెల్‌గా 'KGF Chapter 2' తీస్తున్నారు.

మొదటి భాగం భారీ విజయాన్ని అందుకోవడంతో 'KGF Chapter 2'పై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్‌కు ఊహించని రీతిలో రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు, ఇండియన్ సినిమా రికార్డులను ఇది బద్దలు కొట్టేసింది. తద్వారా ప్రీ బిజినెస్‌ను కూడా అత్యధిక మొత్తానికి డీల్ చేసుకోగలిగింది. ఈ మూవీ ఇండియన్ సినిమాపై చూపించిన ప్రభావాన్ని ఉదహరించే ఓ పరిణామం తాజాగా జరిగింది. 'KGF Chapter 2' టీజర్‌లోని డైలాగ్‌ను భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ వాడడమే దీని సారాశం.

Virender Sehwag Use KGF Chapter 2 Dialogue

ఈరోజు (ఫిబ్రవరి 19) శివాజీ మహారాజ్ జయంతి. దీనిని పురస్కరించుకుని డాషింగ్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తన ట్విట్టర్ ఖాతాలో ఆయన ఫోటోను షేర్ చేశాడు. అంతేకాదు, 'KGF Chapter 2' టీజర్‌లో వాడిన History tells us that powerful people come from powerful places. History was wrong! Powerful people make places powerful' డైలాగును కూడా రాసుకొచ్చాడు. దీంతో ఈ ట్వీట్‌కు భారీ స్థాయిలో స్పందన వస్తోంది. మరీ ముఖ్యంగా దీనిపై కర్నాటకకు చెందిన ఎంతో మంది సినీ ప్రియులు స్పందిస్తున్నారు. ఇదిలా ఉండగా.. హొంబళే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్‌గా చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X