డ్రగ్స్‌ కేసులో వివేక్ ఒబెరాయ్ బామ్మర్థి పరారీ.. వెంటాడుతున్న పోలీసులు

డ్రగ్ రాకెట్ కేసులో కన్నడ సినీ ప్రముఖులపై బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. తాజాగా డ్రగ్ రాకెట్‌తో సంబంధాలు ఉన్న మాజీ మంత్రి కుమారుడు, బాలీవుడ్ హీరో వివేక్ ఒబేరాయ్ బామ్మర్ధి ఆదిత్య ఆల్యాను పట్టుకొనేందుకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో సినీ నిర్మాత శివ ప్రకాశ్ కూడా లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడం గమనార్హం.

డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్న ఆదిత్య ఆల్వా, శివ ప్రకాశ్ దేశం విడిచి వెళ్లకుండా జాగ్రత్తలు పడుతున్నాం. వారిద్దరూ కొంతకాలంగా పరారీలో ఉన్నారు. అందుకే లుక్ అవుట్ నోటీసులు జారీ చేశాం అని బెంగళూరు పోలీస్ జాయింట్ కమిషనర్ సందీప్ పాటిల్ మీడియాకు వెల్లడించారు.

Vivek Oberois brother-in-law Aditya Alva in Drug Rocket case, Look out issues

డ్రగ్స్ సప్లయర్లతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు వెలుగులోకి రావడంతో ఉత్త బెంగళూరు హెబ్బల్‌లోని నటుడు ఆదిత్య అల్వా నివాసంలో అధికారులు సోదాలు నిర్వహించారు. డ్రగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ ప్రముఖుల్లో ఆల్వా 12వ వ్యక్తి. ఈ కేసులో శివ ప్రకాశ్ నంబర్ 1 నిందితుడు అని పోలీసులు పేర్కొన్నారు.

డ్రగ్స్ కేసులో ఇప్పటికే అరెస్టై పరప్పానా అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్న రాగిణి, సంజనాల బెయిల్ పిటిషన్‌ను సెప్టెంబర్ 24వ తేదీన ఎన్డీపీఎస్ ప్రత్యేక కోర్టు విచారించనున్నది. ఈ కేసులో రాగిణి సెప్టెంబర్ 4 తేదీన, సంజనా సెప్టెంబర్ 8 తేదీన అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X