డ్రగ్స్ కేసులో వివేక్ ఒబేరాయ్‌కి షాక్.. భార్య ప్రియాంక అల్వాకు సమన్లు..

బెంగళూరు డ్రగ్స్ రాకెట్‌ కేసులో స్థానిక సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) అధికారులు మరోసారి పంజా విసిరారు. ఇప్పటికే ఆదిత్య ఆల్వా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న నేపథ్యంలో పోలీసులు సర్చ్ వారెంట్‌ను జారీ చేశారు. ఆ క్రమంలో వివేక్ ఒబేరాయ్, ఆయన భార్య ప్రియాంక ఆల్వా ఇంటిలో గత రెండు రోజులుగా సోదాలు జరిపారు. ఈ క్రమంలో ఆమెను విచారణకు హాజరుకావాలంటూ సమన్లు కూడా జారీ చేయడం సంచలనంగా మారింది. ఈ కేసు విచారణలోకి వెళితే..

రాగిణి, సంజనాల అరెస్ట్‌తో

రాగిణి, సంజనాల అరెస్ట్‌తో

కర్ణాటక వ్యాప్తంగా డ్రగ్స్ రాకెట్ లింకులు బయటపడిన నేపథ్యంలో సినీ హీరోయిన్లు రాగిణి, సంజన గల్రానీ‌ని అరెస్ట్ చేసి కస్టడీకి తరలించారు. రాగిణి, సంజనా అరెస్ట్‌తో కేసు మరింత తీవ్రతరమైంది. వారికి బెయిల్ కూడా నిరాకరిస్తూ బెంగళూరు వ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆదిత్య ఆల్వాను అదుపులోకి తీసుకోవడానికి చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి.

వివేక్ ఒబేరాయ్ ఇంటిలో సోదాలు

వివేక్ ఒబేరాయ్ ఇంటిలో సోదాలు

వివేక్ ఒబేరాయ్ ఇంటిలో ఆ తలదాచుకొన్నారనే అనుమానంతో సీసీబీ అధికారు వారెంట్లు జారీ చేసి సోదాలు నిర్వహించారు. గురువారం జరిగిన సోదాల సందర్భంగా ప్రియాంక ఆల్వా సహకరించలేదని పోలీసులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. విచారణ సందర్భంగా తన మొబైల్ ఫోన్‌ ఇవ్వడానికి నిరాకరించారనే విషయాన్ని పోలీసుల వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే ఆమెకు సమన్లు జారీ చేశారు అని పోలీసులు తెలిపారు.

వాట్సాప్ ద్వారా వివేక్ ఒబేరాయ్ భార్యకు సమన్లు

వాట్సాప్ ద్వారా వివేక్ ఒబేరాయ్ భార్యకు సమన్లు

బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు ప్రియాంక ఆల్వాను విచారణకు రమ్మని వాట్సప్ ద్వారా సమన్లు జారీ చేశారు. పోలీసుల సమన్ల ప్రకారం ఆమె శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో విచారణకు హాజరుకావాల్సి ఉంది. వివేక్ ఒబెరాయ్ నివాసం, అలాగే భార్యకు సమన్లు జారీ చేసిన విషయం కన్నడ పరిశ్రమలో చర్చనీయాంశమైంది.

Recommended Video

Sushant Singh Rajput సూసైడ్ కి Bollywood Lady Gangs నే కారణం ! Raveena Tandon
ఆదిత్య అల్వా కోసం గాలింపు

ఆదిత్య అల్వా కోసం గాలింపు

కన్నడ సినీ పరిశ్రమలో డ్రగ్స్ రాకెట్ కేసు దర్యాప్తులో ఆదిత్య అల్వా పేరు తెరపైకి వచ్చింది. గౌరీ లంకేష్ సోదరుడు ఇంద్రజిత్ లంకేష్‌తో డ్రగ్స్ వ్యవహారాలు జరిపారనే ఆరోపణలు వచ్చాయి. దాంతో అల్వాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దాదాపు సెప్టెంబర్ 4వ తేదీ నుంచి అల్వా తప్పించుకు తిరుగుతున్నారు. మాజీ మంత్రి, జేడీఎస్ నేత జీవన్ అల్వాకు కుమారుడు ఆదిత్య అల్వా, ప్రియాంక అల్వా అనే విషయం తెలిసిందే. ఈ కేసులో అదిత్యాను అరెస్ట్ చేయడానికి రకరకాలుగా పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X