War 2 Vs Coolie: వార్ 2 షోస్ క్యాన్సిల్.. కూలీకి థియేటర్ల కేటాయింపు.. రజనీ హై ఫీవర్ మానియా!

భారతీయ సినిమా పరిశ్రమలో రెండు భారీ బడ్జెట్ సినిమాలు, అగ్ర హీరోలు, మల్టీ స్టారర్ ఫ్లేవర్ ఉన్న చిత్రాల విడుదల ఆసక్తికరంగా మారింది. పంద్రాగస్టు లాంగ్ వీకెండ్‌ను క్యాష్ చేసుకోవడానికి రజనీకాంత్ నటించిన కూలీ, హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమాలు ఆగస్టు 14వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అయ్యేందుకు సిద్దమయ్యాయి. ఈ రెండు సినిమాలకు పలు ప్రాంతాల్లో క్రేజ్ డిఫరెంట్‌గా కనిపిస్తున్నది. ఈ సినిమాలకు సంబంధించిన ఇంటస్టింగ్ విషయాల్లోకి వెళితే..

కూలీ సినిమా విషయానికి వస్తే.. రజనీకాంత్ తన నట జీవితంలో 50 ఏళ్లు పూర్తి చేసుకొన్న సందర్భంగా రూపొందిన ఈ సినిమాలో నాగార్జున అక్కినేని, అమీర్ ఖాన్, ఉపేంద్ర, పూజా హెగ్డే, శృతిహసన్ లాంటి నటీనటులు నటించారు. ఈ సినిమాకు అనిరుధ్ అందించిన పాటలు ఇప్పటికే మోత మోగిస్తున్నాయి. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమాకు భారీ క్రేజ్ కనిపిస్తున్నది.

War2 Shows cancelled in Bangalore

ఇక బాలీవుడ్‌లో పాపులర్ ప్రొడక్షన్ హౌస్ యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా రూపొందించిన వార్ 2 చిత్రానికి బ్రహ్మస్త్ర ఫేమ్ ఆయన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. హృతిక్ రోషన్‌తోపాటు జూనియర్ ఎన్టీఆర్ ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమా ద్వారా తారక్ హిందీ సినిమాకు పరిచయమైతే.. హృతిక్ తెలుగు ప్రేక్షకులకు ఇంట్రడ్యూస్ కాబోతున్నారు.

ఇక కూలీ, వార్ 2 సినిమాల మధ్య బాక్సాఫీస్ పోటీ భారీగా కనిపిస్తున్నది. అయితే పలు ప్రాంతాల్లో కూలీ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు అదిరిపోయాయి. ఓవర్సీస్‌లో ముఖ్యంగా నార్త్ అమెరికాలో 2 మిలియన్ డాలర్లు అంటే 176 కోట్ల రూపాయలు ఇప్పటికే వసూలు చేసింది. ఓవరాల్‌గా ఓవర్సీస్‌లో 4 మిలియన్ డాలర్ల వరకు రాబట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రిపోర్ట్ చూస్తే వార్ 2 సినిమాపై కూలీ చిత్రం డామినేషన్ కనబరుస్తున్నది. వార్ 2 చిత్రం నార్త్ ఇండియాలో కూడా ప్రభావం చూపలేకపోతున్నది. ఇక తెలుగు రాష్ట్రాల్లో వార్ 2 చిత్రం కూలీ సినిమాతో సమానంగా పోటీ పడుతున్నది. తమిళనాడులో కూలీ చిత్రానికి బ్రహ్మండమైన ఆదరణ లభ్యమవతున్నది. ఇలా ప్రపంచవ్యాప్తంగా కూలీ సినిమా భారీ రెస్పాన్స్‌తో సిద్దమైంది.

ఇక వార్ 2 సినిమా కర్ణాటకలో బాక్సాఫీస్ వద్ద తడబాటుకు గురి అవుతున్నది. కర్ణాటకలో కూలీ ప్రభంజనానికి తట్టుకోలేకపోతున్నది. ఇప్పటికే కూలీ చిత్రం రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబడుతున్నది. అయితే వార్ 2 సినిమాకు బెంగళూరు, కర్ణాటకలోని ఇతర ప్రాంతాల్లో పెద్దగా రెస్పాన్స్ లేకపోవడం, పేలవంగా ఆక్యుపెన్సీ ఉండటంతో షోలు క్యాన్సిల్ చేసి.. కూలీ సినిమాకు కేటాయిస్తున్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా ఐమ్యాక్స్ థియేటర్లతో వార్ 2 ఒప్పందం కుదుర్చుకొన్నది. అయితే ఆ అగ్రిమెంట్‌ను బ్రేక్ చేసి బెంగళూరులో కూలీ సినిమాకు థియేటర్‌ను కేటాయించడం సెన్సేషన్‌గా మారడమే కాకుండా రజనీ మానియా ఏమిటో చెప్పింది.

More from Filmibeat

Read more about: war 2 coolie rajinikanth
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X