twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఒక్క ముద్దు అనిచెప్పి ఎక్కడపడితే అక్కడ కెమెరా.. చేతులెత్తేసిన హీరోయిన్!

    |

    బాలీవుడ్ లో మొదలైన మీటూ ఉద్యమం దక్షణాది చిత్ర పరిశ్రమకు కూడా పాకిన సంగతి తెలిసిందే. సంజన, శృతి హరిహరన్ లాంటి కన్నడ హీరోయిన్లు తీవ్రమైన ఆరోపణలతో సంచలనం సృష్టించారు. బాలీవుడ్ లో తనుశ్రీ దత్త నానా పాటేకర్ పై చేసిన వ్యాఖ్యలతో పేరు దుమారం మొదలయింది. అదే స్పూర్తితో సౌత్ హీరోయిన్లు కూడా తనకు జరిగిన లైంగిక వేధింపుల గురించి ముందుకొచ్చి మాట్లాడారు. శృతి హరిహరన్, సీనియర్ నటుడు అర్జున్ వ్యవహారంలో కేసు కోర్టువరకు వెళ్లిన సంగతి తెలిసిందే. హాట్ హీరోయిన్ సంజన మాత్రం చివరి నిమిషంలో చేతులెత్తేసింది.

    గండ హెండతి సినిమాలో

    గండ హెండతి సినిమాలో

    రవి శ్రీవత్స దర్శత్వం వహించిన గండ హెండతి చిత్ర విషయంలో తనకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయని సంజన ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ముద్దు సన్నివేశాలు, శృంగార సన్నివేశాల పేరుతో దర్శకుడు తనని వేధించాడని సంజన ఘాటు వ్యాఖ్యలు చేసింది. దీనితో కన్నడ చిత్ర పరిశ్రమలో దుమారం మొదలైంది.

    ఒకే ముద్దు అని చెప్పి

    ఒకే ముద్దు అని చెప్పి

    ఈ చిత్రంలో కేవలం ఒకే ముద్దు ఉంటుందని దర్శకుడు చెప్పారు. ఆ మేరకు మాత్రమే మా మధ్య ఒప్పందం జరిగింది. కానీ చిత్రీకరణ సమయంలో మాత్రం ఎక్కడ పడితే అక్కడ కెమెరాలు పెడుతూ 15 ముద్దు సీన్లు చిత్రీకరించారని సంజన పేర్కొంది. అడ్డు చెబితే నీకు ఇండస్ట్రీలో భవిష్యత్తు ఉండదని బెదిరించారని పేర్కొంది. ఇండస్ట్రీకి కొత్త కావడంతో అప్పుడు నేను ఏమిచేయలేకపోయా అంటూ సంజన మీటూ ఉద్యమం నేపథ్యంలో ఘాటు వ్యాఖ్యలు చేసింది.

    చరణ్ రెవెన్యూ అంటే ఏమిటో చూపించాడు, ఎన్టీఆర్ వరుసగా.. తిడుతున్నవాళ్ళు కూడా! చరణ్ రెవెన్యూ అంటే ఏమిటో చూపించాడు, ఎన్టీఆర్ వరుసగా.. తిడుతున్నవాళ్ళు కూడా!

    కన్నడ ఫిలిం ఛాంబర్

    కన్నడ ఫిలిం ఛాంబర్


    సంజన వ్యాఖ్యలు కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించాయి. దర్శకులంతా సంజన కామెంట్స్ విషయంలో ఫిలిం ఛాంబర్ లో సమావేసం నిర్వహించారు. అసత్య ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. సంజన దిగివచ్చి క్షమాపణలు కోరేవరకు మరే చిత్రంలో ఆమెకు అవకాశం కల్పించకుండదని నిర్ణయం తీసుకున్నారు.

    దిగిరాక తప్పలేదు

    దిగిరాక తప్పలేదు

    దీనితో సంజన దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడింది. సంజన చివరకు దర్శకుడు రవి శ్రీవత్సని క్షమాపణలు కోరింది. సంజన క్షమాపణలు చెప్పడంలో నటుడు అంబరీష్ ప్రధాన పాత్ర వహించారు. తన నివాసానికి సంజనని పిలిపించుకునే అంబరీష్ క్షమాపణలు చెప్పాల్సిందిగా ఆమెని ఒప్పించారు. ఈ వివాదం సద్దుమణిగినా.. సంజన తన ఆరోపణల విషయంలో చేతులెత్తేసినట్లు అయింది.

    English summary
    Weeks after MeToo claim, Sanjjanaa Galrani apologises to director. Ganda Hendathi movie issue
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X