For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలా చేయడం ఇష్టం లేకే... నటి రమ్య ప్రియుడితో విడిపోయారా?

|

నటి, కాంగ్రెస్ మాజీ ఎంపీ, పార్టీ డిజిటల్ టీమ్ హెడ్ దివ్య స్పందన అలియాస్ రమ్య 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత మీడియాకు కనిపించడమే మానేశారు. వీలైనంత లో ప్రొఫైల్ మెయింటేన్ చేస్తున్నారు. దీంతో ఆమె తన పోర్చుగీస్ బాయ్ ఫ్రెండ్ రాఫెల్‌తో డేటింగ్ చేయడమే ఇందుకు కారణం అనే రూమర్స్ తెరపైకి వచ్చాయి.

అంతే కాదు త్వరలో ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారని, వీరి వివాహం దుబాయ్‌లో జరుగబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఓ తమిళ వెబ్ సైట్‌తో రమ్య తల్లి రంజిత మాట్లాడుతూ ఈ రూమర్లను ఖండించారు. 'రమ్యకు ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదని, ఆమె ఎప్పుడు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయినా ఈ విషయం గురించి ఓపెన్‌గా మాట్లాడతాం. రహస్యంగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు' అన్నారు.

ఆ విషయంలో ఇద్దరికీ ఏకాభిప్రాయం కుదరటం లేదట

ఆ విషయంలో ఇద్దరికీ ఏకాభిప్రాయం కుదరటం లేదట

‘రమ్య పూర్తి ఫోకస్ ఎన్నికల మీదనే ఉంది. రాఫెల్ తన వ్యాపార వ్యవహారాలతో బిజీగా ఉనప్నారు. వారిద్దరికీ కలిసి గడిపేంత సమయం కూడా చిక్కడం లేదు. అంతే కాకుండా రమ్యకు ఇండియా వదిలి వెళ్లిపోవాలనే ఆలోచన లేదు. పోర్చుగల్ విడిచి రావడానికి రాఫెల్ సిద్ధంగా లేరు. ఈ కారణంగా...వారు ఇద్దరూ విడిపోవడమే మంచిది అనే ఆలోచనలో ఉన్నారు. అయినప్పటికీ ఇద్దరూ మంచి స్నేహితులుగా ఉన్నారు' అని రంజిత తెలిపారు.

సినిమాల్లోకి వచ్చాక పేరు మార్చు

సినిమాల్లోకి వచ్చాక పేరు మార్చు

2003లో ఓ కన్నడ సినిమా ద్వారా దివ్య స్పందన తన కెరీర్ మొదలు పెట్టారు. అయితే సినిమాల్లోకి వచ్చిన తర్వాత తన పేరును రమ్యగా మార్చుకున్నారు. కన్నడతో పాటు పలు తెలుగు, తమిళ చిత్రాల్లో ఆమె నటించారు. తెలుగులో ‘అభిమన్యు' అనే చిత్రం చేశారు.

కాంగ్రెస్ పార్టీలో చేరి ఆపై ఎంపీగా

కాంగ్రెస్ పార్టీలో చేరి ఆపై ఎంపీగా

2012లో కాంగ్రెస్ పార్టీలో చేరిన రమ్య... 2013లో కర్నాటకలోని మాండ్య లోక్ సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. అయితే 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సిఎస్ పుత్తరాజు చేతిలో స్వల్ప మెజారిటీతో ఓటమి పాలయ్యారు.

రమ్య సినీ కెరీర్

రమ్య సినీ కెరీర్

రమ్య ఇప్పటి వరకు దక్షిణాదిన కన్నడ, తెలుగు, తమిళంలో కలిపి 39 చిత్రాల్లో నటించారు. రాజకీయాల్లోకి ఎంటరయ్యాక సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. అయితో ఓటమి తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా వర్కౌట్ కాలేదు. 2019లో ఆమె ప్రధాన పాత్రలో ‘దిల్ కా రాజా' అనే చిత్రం మొదలైంది. అయితే అది మధ్యలోనే ఆగిపోయింది.

English summary
The latest rumour about the couple is that they are all set to get married in Dubai. Speaking to a Tamil entertainment website, Divya Spandana aka Ramya's mom Ranjitha has denied her daughter marriage rumours. "Ramya has no plans of getting married soon. If she decides to get married someday, we will talk about it openly. She has no reason to get married secretly." she said.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more