'నా మాతృభూమి నాకు ముఖ్యం.. కోట్ల రూపాయలు వదులుకున్న కిచ్చ సుదీప్
భారతదేశంలో తమ ప్రాంతం, భాష, సంస్కృతి, ఆచార వ్యవహారాలను ప్రేమించడం.. వాటి కోసం అవసరమైతే కొట్లాడే విషయంలో కన్నడిగులు ముందుంటారు. జాతి ప్రయోజనాల విషయంలో వారు ఎంతవరకైనా వెళ్తారు. కావేరీ జలాల విషయంలో తమిళనాడుతో ఇప్పటికీ గొడవ పడుతూనే ఉంటారు. మొన్నామధ్య వాణిజ్య , వ్యాపార సంస్థల నేమ్ బోర్డులలో 60 శాతం కన్నడ పదాలే ఉండాలంటూ పెద్ద ఆందోళనకు దిగారు.
బెంగళూరు నగర పాలక సంస్థ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలంటూ కన్నడ రక్షణ వేదికే ఆందోళనకు దిగింది. కొన్ని వ్యాపార సంస్థలు కావాలనే కన్నడ భాషను నిర్లక్ష్యం చేస్తున్నాయంటూ హోటళ్లు, పలు దుకాణాల బయట ఆంగ్లంలో ఉన్న బోర్డులను నిరసనకారులు ధ్వంసం చేయడంతో అప్పట్లో ఈ వివాదం దుమారం రేపింది.

తాజాగా సిద్ధరామయ్య ప్రభుత్వం మరో వివాదానికి బీజాలు వేసింది. రాష్ట్రంలోని ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల పనిగంటలు పెంచాలని కర్ణాటక సర్కార్ యోచిస్తోంది. ఇందుకోసం కర్ణాటక షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ -1961లో కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించింది. దీని ప్రకారం .. కర్ణాటక పరిధిలోని ఐటీ, ఐటీఈఎస్, బీపీఓ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు రోజుల 12 గంటలకు మించి పనిచేసేందుకు వీలు కల్పిస్తుంది. అయితే దీనిపై ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు భగ్గుమంటున్నారు.
ఈ వివాదం సద్దుమణగకముందే మరో అంశాన్ని కెలికింది సిద్ధూ సర్కార్. ప్రైవేట్ రంగంలో నాన్ మేనేజ్‌మెంట్ పోస్టుల్లో 70 శాతం, మేనేజ్‌మెంట్ పోస్టుల్లో 50 శాతం స్థానికులకు అవకాశం కల్పించాలంటూ ఓ చట్టానికి రూపకల్పన చేసింది. అర్హులైన స్థానికులు లేనిపక్షంలో బయటివారికి ఉద్యోగాలు ఇవ్వొచ్చని తెలిపింది. ఈ బిల్లుపై ప్రైవేట్ సెక్టార్ నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలంటే టెక్ కంపెనీలు రాష్ట్రం నుంచి తరలిపోతాయని నాస్‌కాం సైతం హెచ్చరించింది. ఈ బిల్లు టెక్ ఇండస్ట్రీలో అగ్రస్థానంలో ఉన్న బెంగళూరు నగరానికి ప్రతిబంధకంగా మారుతుందని తెలిపింది.
అయితే ఫోన్ పే సీఈవో సమీర్ నిగమ్ కాస్త ఘాటుగా స్పందించారు. ఉద్యోగానికి ప్రతిభే కొలమానం తప్పించి స్థానికత కాదని.. తాను స్థాపించిన సంస్థల ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 25 వేల మంది ఉద్యోగాలు చేస్తున్నారని పేర్కొన్నారు. దీంతో కన్నడ సమాజం భగ్గుమంది.. తమ రాష్ట్ర పయోజనాలకు భంగం వాటిల్లేలా మాట్లాడటంతో ఫోన్ పేకు నిరసన సెగ తగిలింది. ఫోన్ పేను మీ ఫోన్‌లలో అన్‌ఇన్‌స్టాల్ చేయాలని.. దానికి బదులుగా గూగుల్ పే, ఇతర యూపీఐలను వినియోగించాలంటూ సోషల్ మీడియాలో మెసేజ్‌లు చక్కర్లు కొడుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఫోన్ పేకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ స్పందించారు. ఫోన్ పేకు కర్ణాటకలో సుదీప్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. అక్కడ వినియోగదారులు ఫోన్ పే ద్వారా డబ్బును చెల్లించగానే 'థ్యాంక్యూ బాస్ ' అంటూ సుదీప్ వాయిస్ వినిపిస్తుంది. ప్రస్తుతం సమీర్ వ్యాఖ్యలతో.. అసలే మాతృభాష, రాష్ట్రం పట్ల విపరీతమైన అభిమానాన్ని చూపే సుదీప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కర్ణాటక ప్రజల తరపున గళం విప్పాలని ఆయన భావిస్తున్నట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తూ ఉండటంతో ఫోన్ పే సీఈవో సమీర్ నిగమ్ దిగొచ్చారు. భేషరతుగా కర్ణాటక ప్రజలకు క్షమాపణ చెప్పారు. కర్ణాటక అంటే తనకు గౌరవం ఉందని, ఇక్కడే ఫోన్ పే పుట్టిందని.. బెంగళూరు నగరంతోనే మా మూలాలు ఉన్నందుకు గర్విస్తున్నామని సమీర్ తెలిపారు. కన్నడతో పాటు భారతీయ భాషల పట్ల తనకు గౌరవం ఉందని పునరుద్ఘాటించారు . సమీర్ నిగమ్ వివరణతో ఈ వివాదం సద్దుమణిగింది.


Click it and Unblock the Notifications











