‘కెజిఎఫ్’ హీరో యష్ కూతురు ఫస్ట్ ఫోటో ఇదే..

కెజిఎఫ్ స్టార్ యష్, నటి రాధిక పండిత్ పెళ్లికి ముందు నుంచే రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు అప్పట్లో కన్నడ చిత్ర సీమలో పుకార్లు షికార్లు చేశారు. ఎట్టకేలకు ఈ జంట 2016లో తమ ప్రేమ బంధం గురించి అనౌన్స్ చేస్తూ ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు, అదే ఏడాది పెళ్లి చేసుకున్నారు. 2018 డిసెంబర్లో వీరికి కూతురు పుట్టింది.

అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు తమ కూతురుకి సంబంధించిన ఫోటోలు ఏవీ కూడా ఈ స్టార్ కపుల్ బయట పెట్టలేదు. రెండు రోజుల క్రితం కూతురుతో ఆడుకుంటున్న ఫోటో షేర్ షేర్ చేశారు కానీ... అందులో చిన్నారి మొహం కనిపించకపోవడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. అక్షయ్ తృతీయ సందర్భంగా మే 7న పూర్తి ఫోటో రిలీజ్ చేసి అందరినీ సర్ ప్రైజ్ చేశారు.

Yash and Radhika daughter first photo released

యష్ సినిమాల విషయానికొస్తే.. కన్నడ నటుడైన యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన 'కెజిఎఫ్-1' బాక్సాఫీసు వద్ద సంచలన విజయం సాధించింది. కన్నడ సినీ పరిశ్రమలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. తెలుగు, హిందీలో కూడా విడుదల చేయడంతో ప్యాన్ ఇండియా వైడ్ కూడా ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ 'కెజిఎఫ్ 2' మొదలైంది. 'కెజిఎఫ్ 2' ద్వారా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కన్నడ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టే అవకాశం ఉందని టాక్. ఆయనతో పాటు రవీనా టండన్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటి వరకు కన్నడ చిత్ర సీమలో వంద కోట్ల రికార్డు కూడా ఒక్కటీ లేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 200 కోట్లకుపైగా వసూలు చేసిన కెజిఎఫ్ చరిత్ర సృష్టించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి విజయ్ కిరంగదూర్ నిర్మాత.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X