స్పీడ్ మీద ఉన్న యష్ దంపతులు.. కేజీఎఫ్2కు ముందే రెండో బిడ్డకు రెడీ..
కేజీఎఫ్ హీరో యష్ ఎంత వేగంగా సినిమాల్లో నటిస్తున్నాడో.. అంతే వేగంగా సంతానం విషయంలో క్లారిటీగా ఉన్నాడు. గతేడాది డిసెంబర్‌లో ఓ చిన్నారికి జన్మనిచ్చిన యష్ దంపతులు మళ్లీ రెండో బిడ్డ కోసం రెడీ అయ్యారు. ఇటీవల తన కూతురికి నామకరణం చేసిన ఈ దంపతులు మళ్లీ ఓ శుభవార్తతో అభిమానుల ముందుకు వచ్చారు. యష్ దంపతులు ఇన్స్‌టాగ్రామ్‌లో తమ రెండో బిడ్డ గురించి ఏం చెప్పారంటే..

కూతురుకు నామకరణంతో
హీరో యష్, ఆయన భార్య రాధిక శుభవార్తలతో ఇన్స్‌టాగ్రామ్‌ను కుదిపేస్తున్నారు. సుమారు ఆర్నేళ్ల వయసు ఉన్న తమ కూతురికి ఐరా యష్ అని నామకరణం చేసినట్టు ఇటీవల వెల్లడించారు. ఆ పాపను ముద్దుగా బేబీ వైఆర్ పిలుచుకొంటున్నారు. యష్‌లోని వై అక్షరాన్ని, రాధికలోని ఆర్ అక్షరాన్ని జోడించి Baby YR పిలుచుకొంటున్నారు.

కూతురుతో రెండో సంతానం గురించి
ఇటీవల యష్ దంపతులు తమ కూతురు ఐరాతో కూడిన ఓ క్యూట్ వీడియోను ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆ పాప ప్రకటించినట్టుగా.. ఓ సందేశాన్ని అభిమానులతో పంచుకొన్నారు. నాకు ఓ సోదరి రావడానికి రెడీగా ఉంది అని చెప్పించారు. దాంతో యష్ దంపతులు రెండో బిడ్డ కోసం సిద్దమవుతున్నట్టు స్పష్టం చేశారు.

నాన్న మరీ స్పీడ్‌గా
ఐరా వీడియోలో కనిపించిన పదాలు ఏమిటంటే.. నేను ఐరాను. నేను ఇప్పుడే ఓ వార్త విని నమ్మలేకపోతున్నాను. మా నాన్న చాలా స్పీడ్‌గా ఉన్నారు. తొందరో.. ఆలస్యమో నాకు తెలియదు గానీ.. మీరు చాలా హ్యాపీగా ఫీలవుతారని తెలుసు. అమ్మా నాన్నలకు మరో బిడ్డ పుట్టబోతున్నారు. పుట్టుబోయే తమ్ముడో, లేదా చెల్లెలికి నా బొమ్మలిస్తాను అని ఐరా చెప్పింది.

శరవేగంగా కేజీఎఫ్ సీక్వెల్
గతేడాది రిలీజైన కేజీఎఫ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు సాధించింది. కన్నడలోనే రూ.100 కోట్లకుపైగా వసూలు చేసింది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా వసూలు చేసింది. కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా మరో చిత్రం రాబోతున్నది. ఈ చిత్రాన్ని జాతీయ ప్రాజెక్ట్‌గా మలచడంతో బాలీవుడ్ ప్రముఖులు పలువురు నటిస్తున్నారు. త్వరలోనే కేజీఎఫ్2 ప్రేక్షకుల ముందు రానున్నది.


Click it and Unblock the Notifications











