KGF 2 teaser leak; పవర్ఫుల్ లుక్ లో యష్.. హై వోల్టేజ్ యాక్షన్ కాదు.. అంతుకుమించి!

దేశవ్యాప్తంగా అభిమానులు KGF 2 సినిమా కోసం ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఈ ఏడాది సినిమా వస్తుందని అనుకుంటే కరోనా దెబ్బ గట్టిగానే పడింది. దీంతో ఏడాదికి వాయిదా వేయక తప్పలేదు. ఇక ఇప్పుడు అందరి చూపు సినిమా టీజర్ పైనే పడింది. అయితే సడన్ గా సినిమాకు సంబంధించిన టీజర్ లీక్ అవ్వడం వైరల్ అయ్యింది.

 ఒకరోజు ముందుగానే టీజర్ లీక్

ఒకరోజు ముందుగానే టీజర్ లీక్

యష్ పుట్టినరోజు సందర్భంగా జనవరి 8న ఉదయం 10:18నిమిషాలకు KGF 2 టీజర్ ను రిలీజ్ చేయనున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సడన్ గా టీజర్ ఒక రోజు ముందే సోషల్ మీడియాలో లీక్ అవ్వడం సంచలనంగా మారింది. ముందుగా కన్నడలో రిలీజ్ చేసి ఆ తరువాత తెలుగు హిందీ భాషల్లో విడుదల చేస్తారని మొదట ఊహాగానాలు వచ్చాయి.

యష్ పవర్ఫుల్ లుక్

యష్ పవర్ఫుల్ లుక్

ఇక కొన్ని గంటల క్రితం లీకైన సినిమా టీజర్ ను చూస్తే ఆల్ ఇన్ వన్ మాదిరిగా యాక్షన్ ఎపిసోడ్స్ తో టీజర్ ను వదిలారు. వేడిమీద ఉన్న గన్నుపై సిగరెట్ కాల్చుతూ యష్ పవర్ఫుల్ లుక్ లో దర్శనమిచ్చాడు. ఇక పవర్ఫుల్ పీపుల్ కమింగ్ ఫ్రమ్ పవర్ఫుల్ ప్లేసెస్ అనే డైలాగ్ ను యధావిధిగా పెట్టేశారు.

అంచనాల డోస్ ను పెంచిన టీజర్

అంచనాల డోస్ ను పెంచిన టీజర్

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ కథానాయకుడిగా నటిస్తున్న ఆ సినిమా కోసం కేవలం కన్నడ ఆడియెన్స్ అనే కాకుండా టాలీవుడ్, బాలీవుడ్ ఆడియెన్స్ కూడా ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారు. తమిళ జనాల్లో కూడా సినిమాపై అంచనాలు భరిగానే ఉన్నాయి. ఇక లీకైన టీజర్ ఆ అంచనాల డోస్ ను మరింత పెంచేసింది.

వెంటనే అఫీషియల్ టీజర్ రిలీజ్

వెంటనే అఫీషియల్ టీజర్ రిలీజ్

జనవరి 8న యష్ పుట్టినరోజు కావడంతో తప్పకుండా చిత్ర యూనిట్ ఏదో ఒక సర్ ప్రైజ్ ఇస్తుందని సౌత్ ఆడియెన్స్ తో పాటు నార్త్ ఆడియెన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. అయితే ఊహించని విధంగా టీజర్ ముందే లీక్ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఇక మళ్ళీ ఏమనుకున్నారో ఏమో అఫీషియల్ గా రిలీజ్ చేశారు. ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా టీజర్ ని రెడీ చేసినట్లు అర్ధమయ్యింది. దీంతో సోషల్ మీడియాలో అది ట్రెండ్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X