కేజీఎఫ్ 2 డ‌బుల్ ట్రీట్ ఇస్తుంది: యష్, అత్యంత భారీ బడ్జెట్‌, బాలీవుడ్ నటులతో ప్రారంభం

రాకింగ్ స్టార్‌ య‌శ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన కె.జి.ఎఫ్‌- చాప్ట‌ర్ 1 సంచ‌ల‌నాల గురించి తెలిసిందే. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ఖ్యాత హోంబ‌లే ఫిలింస్ సంస్థ అత్యంత భారీ బ‌డ్జెట్‌తో నిర్మించింది. వారాహి చ‌ల‌న‌చిత్రం అధినేత సాయి కొర్ర‌పాటి ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశారు. కేజీఎఫ్ ఘ‌న‌విజ‌యం నేప‌థ్యంలో కేజీఎఫ్ సీక్వెల్‌పై భారీ అంచ‌నాలేర్ప‌డ్డాయి. అలాంటి సినిమా ప్రారంభోత్సవం నిరాడంబరంగా జరిగింది. వివరాల్లోకి వెళితే..

 కేజీఎఫ్ రూ.250 కోట్ల కలెక్షన్లు

కేజీఎఫ్ రూ.250 కోట్ల కలెక్షన్లు

ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన కేజీఎఫ్ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద దాదాపు 250 కోట్లు వ‌సూలు చేసి రికార్డులు సృష్టించింది. దక్షిణాదిలో బాహుబ‌లి త‌ర్వాత ఆ స్థాయి గుర్తింపు ద‌క్కించుకున్న సిరీస్ ఇది. క‌న్న‌డ‌లో రూ.100 కోట్లు వ‌సూలు చేసిన ఈ చిత్రం హిందీలో ఏకంగా రూ.45 కోట్లు పైగా వ‌సూలు చేయ‌డం ఓ సంచ‌ల‌నం. అలాగే తెలుగు రాష్ట్రాల్లోనూ అద్భుత వ‌సూళ్లు సాధించింది.

 కెజిఎఫ్ చాప్ట‌ర్ 2 పూజా కార్యక్రమాలతో

కెజిఎఫ్ చాప్ట‌ర్ 2 పూజా కార్యక్రమాలతో

కెజిఎఫ్ చాప్ట‌ర్ 2 `చిత్రాన్ని మార్చి 13న బెంగ‌ళూరు కంఠీర‌వ స్టూడియోస్‌లో పూజా కార్య‌క్ర‌మాల‌తో ఉద‌యం 9.30కు లాంఛ‌నంగా ప్రారంభించారు. ప్ర‌ముఖ న‌టుడు కైకాల స‌త్య‌నారాయ‌ణ త‌న‌యుడు.. `కెజిఎఫ్ 2` ఎగ్జిక్యూటివ్ నిర్మాత కైకాల రామారావు, చిత్ర‌ నిర్మాత విజ‌య్ కిరంగ‌దూర్, ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్, రాకింగ్ స్టార్ య‌శ్, క‌థానాయిక శ్రీ‌నిధి శెట్టి త‌దిత‌రులు ప్రారంభోత్స‌వంలో పాల్గొన్నారు.

2020 వేసవిలో విడుదల

2020 వేసవిలో విడుదల

మార్చి నెలాఖ‌రు నుంచి రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ ప్రారంభిస్తారు. అక్టోబ‌ర్ తో చిత్రీక‌ర‌ణ పూర్త‌వుతుంది. న‌వంబ‌ర్ నుంచి సీజీ వ‌ర్క్ స‌హా నిర్మాణానంత‌ర ప‌నులు పూర్తి చేస్తారు. 2020 వేస‌వి కానుక‌గా సినిమా రిలీజ‌వుతుంది. చాప్ట‌ర్ 1లో న‌టించిన స్టార్లు అంతా ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. అలాగే బాలీవుడ్ కి చెందిన ప‌లువురు ప్ర‌ముఖ స్టార్లు ఇందులో న‌టిస్తున్నారు అని చిత్ర యూనిట్ వెల్లడించింది. సంజయ్ దత్ విలన్ పాత్రలో కనిపిస్తారనే ప్రచారం జరుగుతున్నది.

భారీ బడ్జెట్‌తో హోంబ‌లే ఫిలింస్ నిర్మాణం

భారీ బడ్జెట్‌తో హోంబ‌లే ఫిలింస్ నిర్మాణం

కేజీఎఫ్ తొలి భాగానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ప్ర‌శాంత్ నీల్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సీక్వెల్ చిత్రాన్ని ప్ర‌ఖ్యాత హోంబ‌లే ఫిలింస్ సంస్థ అత్యంత భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కించ‌నుంది. ఈ సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా రాకింగ్ స్టార్ యష్ మాట్లాడుతూ.. కెజిఎఫ్ చాప్ట‌ర్ 1 చిత్రాన్ని ఎంతో ప్రేమించి అభిమానించిన అభిమానుల‌కు చాప్ట‌ర్ 2 డ‌బుల్ ట్రీట్ ఇస్తుంది అని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X