KGF 3: హీరో యష్ లేకుండా.. జేమ్స్ బాండ్ తరహాలో మేకర్స్ బిగ్ ప్లాన్?

కన్నడ సినిమా చిత్ర పరిశ్రమ స్థాయిని ఒక్కసారిగా పెంచేసిన సినిమాలలో KGF మొదటి స్థానంలో ఉంటుంది అని చెప్పవచ్చు. ఈ సినిమా మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకోగా రెండవ భాగం మాత్రం అంతకుమించి అనేలా ఏకంగా 1000 కోట్లను దాటడం విశేషం. హోంబెల్ ఫిలిమ్స్ నుంచి వచ్చిన ఈ సినిమాకు సీక్వెల్స్ ఇంకా కొనసాగుతూనే ఉంటాయి అని ఇదివరకే క్లారిటీ ఇచ్చారు.

దర్శకుడు ప్రశాంత్ నీల్ హీరో యష్ ఇద్దరు కూడా అదిరిపోయే కాంబినేషన్ అని రెండు సినిమాలతో చాలా బాగా క్లారిటీ వచ్చేసింది. KGF 3 సినిమా ఉంటుందని రెండవ భాగం చివరలోనే క్లారిటీ ఇచ్చారు. ఇక షూటింగ్ అలాగే రిలీజ్ ఎప్పుడు ఉంటుంది అనే విషయంలో మాత్రం పెద్దగా క్లారిటీ ఇవ్వలేదు. కానీ సినిమా మాత్రం 2025లో మొదలవుతుంది అని ఇక సినిమా రిలీజ్ 2026 తర్వాత ఉండవచ్చు అని ఇటీవల చిత్రాల నిర్మాత విజయ్ క్లారిటీ ఇచ్చారు.

Yash KGF Sequels To Have Different stats Like James Bond style

ఇక రాబోయే రోజుల్లో మరిన్ని డిఫరెంట్ KGF సీక్వెల్స్ ఫ్రాంఛైజ్ గా కొనసాగబోతున్నట్లు కూడా ఆయన ఒక హింట్ అయితే ఇచ్చారు. అంతే కాకుండా కేజిఎఫ్ మొత్తంగా ఐదు భాగాల వరకు కొనసాగవచ్చు అని కూడా చెబుతున్నారు. ఇక రాబోయే రోజుల్లో మాత్రం ఈ సినిమా కూడా జేమ్స్ బాండ్ తరహాలో కూడా ఉండవచ్చు అని మరొక కొత్త తరహా టాక్ వినిపిస్తోంది. జేమ్స్ బాండ్ సినిమాలలో ఎలాగైతే హీరోలు మారారో ఇప్పుడు కేజీఎఫ్ లో కూడా అదే తరహాలో హీరోలు మారబోతున్నారు.

Yash KGF Sequels To Have Different stats Like James Bond style

ఇక దర్శకుడు ప్రశాంత్ ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ సినిమాను తెరపైకి తీసుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు KGF 3 కు కూడా సంబంధం ఉంటుందని అంటున్నారు. అలాగే యష్ ఇందులో ఒక కీలక పాత్రలో కనిపించవచ్చు అని తెలుస్తోంది. ఇక మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రశాంత్ తో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. ఇక ఈ కాంబినేషన్స్ లో కూడా దర్శకుడు మల్టివర్స్ ను కొనసాగించవచ్చని, కేజీఎఫ్ సీక్వెల్స్ ని తెరపైకి తీసుకురావచ్చు అని కథనాలు వెలువడుతున్నాయి. మరి ఇవన్నీ ఎంతవరకు నిజమవుతాయో కాలమే సమాధానం చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X