KGF Chapter 2 హిందీ వెర్షన్‌ కోసం మరొకరు: అంత సాహసం చేయనన్న హీరో యశ్

కన్నడ సినీ పరిశ్రమ నుంచి వచ్చి.. దేశ వ్యాప్తంగా ప్రభావం చూపిన చిత్రం 'KGF Chapter 1'. స్టైలిష్ హీరో యశ్ - క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ అయింది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లోనూ సూపర్ డూపర్ హిట్ అయింది. తద్వారా కలెక్షన్లను కూడా భారీ రేంజ్‌లో రాబట్టింది. అదే సమయంలో జాతీయ అవార్డును సైతం దక్కించుకుంది. ఇంతటి ప్రభావం చూపిన ఈ మూవీకి సీక్వెల్ రాబోతుంది. తాజాగా దాని గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

మొదటి భాగం సూపర్ డూపర్ హిట్ అవడంతో.. 'KGF Chapter 2' పేరిట దానికి సీక్వెల్ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు కూడా అదే రీతిలో ఉన్నాయి. ఈ సినిమా కోసం హీరో యశ్ అన్ని భాషల్లోనూ స్వయంగా డబ్బింగ్ చెప్పుకోబోతున్నాడని ఆ మధ్య ఓ న్యూస్ బయటకు వచ్చింది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. దీనికి ఈ స్టార్ హీరో సిద్ధంగా లేడని తెలిసింది. అంతేకాదు, బాలీవుడ్ ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ సంకేత్ మహీత్రూనే అతడికి గాత్ర దానం చేయబోతున్నాడని అంటున్నారు. అయితే, మిగిలిన భాషల గురించి మాత్రం క్లారిటీ రావడం లేదు.

Yash not ready to Hindi Dubbing for KGF Chapter 2

ఇదిలా ఉండగా.. 'KGF Chapter 2' అధీరాకు రాఖీకి మధ్య జరిగే పోరాటంతో రాబోతుంది. ఇందులో విలన్‌గా బాలీవుడ్ హీరో సంజయ్ దత్ నటిస్తున్నారు. ఇప్పటికే ఆయనకు సంబంధించిన లుక్స్ కూడా విడుదలయ్యాయి. ఇక, ఆ మధ్య విడుదలైన టీజర్‌కు ఊహించని స్థాయిలో స్పందన వచ్చింది. దీంతో ఇండియన్ మూవీ రికార్డులు బద్దలైపోయాయి. హొంబళే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమెతో పాటు ఎంతో మంది ప్రముఖులు నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X