ఏ తప్పు చేయలేదు.. నేను భయపడే సమస్యే లేదు.. కేజీఎఫ్ హీరో యష్
Recommended Video

పన్ను ఎగవేత, నలధనం దాచుకొన్నారనే ఆరోపణలపై కన్నడ, తమిళ చిత్ర పరిశ్రమల్లో ఆదాయపు పన్ను అధికారులు ఆకస్మిక దాడులు ఇటీవల నిర్వహించిన సంగతి తెలిసిందే. కన్నడలో స్టార్ హీరోలు యష్, శివ రాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్, కిచ్చ సందీప్ తదితరుల నివాసాలపై దాడులు నిర్వహించారు. ఐటీ చేసిన దాడులపై యష్ స్పందించారు. ఆయన ఏమన్నారంటే..

లెక్కకు మించిన నల్లధనం
గురువారం తెల్లవారుజామున బెంగళూరులో హీరోల నివాసాల్లో విస్తృత సోదాలు నిర్వహించారు. లెక్క చూపని నగదు, డబ్బు, ఆఫీసులు, బంగారం, కార్లను అధికారులు సీజ్ చేశారు. హీరోల నివాసాల్లో లెక్కకు మించి నల్లధనం ఉన్నట్టు ఐటీ విభాగం ఆరోపణలు చేయడం గమనార్హం.

హుటాహుటిన యష్ బెంగళూరుకు
తన నివాసం, ఆఫీసుపై ఐటీ అధికారులు సోదాలు, దాడులు నిర్వహిస్తున్నారనే సమాచారంతో హుటాహుటిన యష్ బెంగళూరు చేరుకొన్నారు. అనంతరం దాడుల వివరాలపై యష్ ఆరా తీసినట్టు కథనాలు వెలువడ్డాయి. యష్ నటించిన కేజీఎఫ్ సెన్సేషనల్ హిట్ కావడంతో ఐటీ అధికారులు అప్రమత్తమైనట్టు సమాచారం.

నేను ఏ తప్పు చేయలేదు
యష్ మీడియాతో మాట్లాడుతూ.. పన్ను చెల్లింపు విషయంలో నేను ఏ తప్పు చేయలేదు. ఆదాయపు పన్ను అధికారులు తమ విధిని నిర్వహించుకొనేందుకు సహకరించాం. నేను ఈ విషయంలో భయపడను. నా గురించి వస్తున్న ఊహగానాలు అవాస్తవం అని అన్నారు.

రూ. 200 కోట్ల క్లబ్‌లో
యష్ నటించిన కేజీఎఫ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు సాధిస్తున్నది. సుమారు రూ.175 కోట్ల వసూళ్లతో దూసుకెళ్తున్నది. త్వరలోనే రూ.200 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సినీ విమర్శకులను, సగటు ప్రేక్షకుడిని ఆలరించింది. ఈ చిత్రంలో యష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది.


Click it and Unblock the Notifications











