‘కెజిఎఫ్ 2’ మొదలైంది: మరో సంచలనం దిశగా యష్ మూవీ!
కన్నడ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన 'కెజిఎఫ్-1' బాక్సాఫీసు వద్ద సంచలన విజయం సాధించింది. కన్నడ సినీ పరిశ్రమలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్ 'కెజిఎఫ్ 2' మొదలైంది. బుధవారం(మార్చి 13) బెంగుళూరులోని కోదండరామస్వామి ఆలయంలో సింపుల్‌గా ప్రారంభోత్సవం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో హీరో యష్, హీరోయిన్ శ్రీనిధి శెట్టి, దర్శకుడు ప్రశాంత్ నీల్.. మరికొందరు చిత్ర బృందం పాల్గొన్నారు. రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ నుంచి ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. మొదటి భాగంలో మొత్తం కన్నడ స్టార్సే కనిపించారు. రెండో భాగంలో బాలీవుడ్ స్టార్లు కూడా భాగం కాబోతున్నారు.

'కెజిఎఫ్ 2' ద్వారా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కన్నడ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టే అవకాశం ఉందని టాక్. ఆయనతో పాటు రవీనా టండన్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ సమాచారం వెలువడనుంది.
'కెజిఎఫ్' సాండల్ వుడ్ ఇండస్ట్రీలో సంచలనం క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు అక్కడ వంద కోట్ల రికార్డు కూడా ఒక్కటీ లేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 200 కోట్లకుపైగా వసూలు చేసిన చరిత్ర సృష్టించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి విజయ్ కిరంగదూర్ నిర్మాత.
ఈ మూవీ బాలీవుడ్లో దాదాపు 50 కోట్ల వరకు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఏరియాలకు కలిపి టోటల్ డిస్ట్రిబ్యూటర్ షేర్ రూ. 12.30 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. కన్నడ డబ్బింగ్ చిత్రానికి తెలుగులో ఇంత షేర్ రావడం రికార్డ్.


Click it and Unblock the Notifications











