twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డిజిటల్ రైట్స్ రికార్డులను తిరగరాసిన ‘కెజిఎఫ్’

    |

    రాకింగ్ స్టార్ యష్ నటించిన కన్నడ చిత్రం 'కెజిఎఫ్' సాండల్‌వుడ్ రికార్డులను తిరగరాస్తూ దూసుకెళుతోంది. విడుదలైన అన్ని భాషల్లో మంచి వసూళ్లు సాధిస్తూ అదరగొడుతున్న ఈ చిత్రం డిజిటల్ రైట్స్‌కు మంచి డిమాండ్ ఏర్పడింది. అమేజాన్ ప్రైమ్ సంస్థ ఈ మూవీ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ రైట్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

    కెజిఎఫ్... కన్నడ, తెలుగు, మలయాళం, తమిళం, హిందీలో విడుదల కావడంతో అన్ని భాషల్లో కలిపి రూ. 18 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కన్నడ చిత్ర సీమలో ఒక సినిమాకు ఇంత భారీ మొత్తంలో డిజిటల్ రైట్స్ రావడం ఇదే తొలిసారి.

    Yashs KGF digital streaming rights sold to Amazon Prime

    కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చే సినిమాలకు కూడా డిజిటల్ మాధ్యమంలో మంచి డిమాండ్ ఏర్పడింది. ఇటీవల'ఛంబల్' చిత్రానికి నెట్‌ఫ్లిక్స్ సంస్థ రూ. 10 కోట్లు ఆఫర్ చేశారు. అయితే ఈ చిత్రాన్ని కేవలం నెట్‌ఫ్లిక్స్‌లో మాత్రమే విడుదల చేయాలని వారు షరతు పెట్టడంతో ఈ డీల్ కేన్సిల్ అయింది.

    మరో వైపు 'కెజిఎఫ్' మూవీ శాటిలైట్స్ కూడా భారీ రేటుకు అమ్ముడవుతున్నాయి. కన్నడ వెర్షన్ రైట్స్... కలర్స్ కన్నడకు, హిందీ వెర్షన్ రైట్స్ సోనీ ఛానల్‌కు అమ్మినట్లు తెలుస్తోంది. ఈ రెండు డీల్స్ ద్వారా నిర్మాతకు రూ. 30 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది.

    విడుదలైన అన్ని చోట్ల 'కెజిఎఫ్' చిత్రం వసూళ్లు అదరగొడుతోంది. వరల్డ్ వైడ్ బిజినెస్ రూ. 100 కోట్ల గ్రాస్ మార్కును దాటేసింది. దీంతో పాటు యూఎస్ఏ మార్కెట్లో కూడా ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది ఇప్పటి వరకు హాఫ్ మిలియన్ డాలర్ వసూలైనట్లు సమాచారం.

    English summary
    Rocking Star Yash's KGF digital streaming rights have been reportedly sold to Amazon Prime. Although there is no official word on the price, the buzz is that Hombale Films has earned Rs 18 crore from the sale of digital rights.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X