పాకిస్థాన్లో సైతం దుమ్ము రేపుతున్న యష్ మూవీ ‘కెజిఎఫ్’
కన్నడ స్టార్ యష్ నటించిన 'కెజిఎఫ్' కన్నడ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల పరంగా పలు సంచలనాలు నమోదు చేసింది. కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళంలో రిలీజైన ఈ మూవీ మంచి వసూళ్లు సాధించింది. ఇటీవల ఈ మూవీ హిందీ వెర్షన్ పాకిస్థాన్‌లో విడుదల చేశారు.
జనవరి 10న పాకిస్థాన్‌లో 'కెజిఎఫ్' విడుదలవ్వగా... ఆడియన్స్, క్రిటిక్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. పాక్‌లో బాలీవుడ్ సినిమాల ఆధిపత్యమే ఎక్కువ. అయితే బాహుబలి సినిమా తర్వాత సౌత్ ఇండియా నుంచి వచ్చే సినిమాలకు కూడా ఇక్కడ ఆదరణ పెరిగింది.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన 'కెజిఎఫ్' చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. మూడేళ్ల షూటింగ్ అనంతరం మొదటి భాగం చాప్టర్-1 పేరుతో డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడతో పాటు హిందీ, తెలుగు, తమళం, మలయాళం దాదాపు 2500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా రూ. 200 కోట్లు రాబట్టిన ఈ చిత్రం కన్నడ సినీ చరిత్రలో హయ్యెస్ట్ వసూళ్లు సాధించిన మూవీగా రికార్డులకెక్కింది. కెజిఎఫ్ చాప్టర్ 2 షూటింగ్ కొంత మిగిలి ఉండటంతో దాన్ని పూర్తి చేసి ఈ ఏడాది విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











