For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాకింగ్ స్టార్ యష్ కుమారుడి బారసాల.. ఛోటా రాకీ భాయ్ పిక్స్ వైరల్

    |

    కేజీయఫ్ సినిమాతో దేశ వ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకున్నాడు కన్నడ రాకింగ్ స్టార్ యష్., అంతకు ముందు కన్నడ పరిశ్రమలో సూపర్ హిట్స్ అందించి, బాక్సాఫీస్‌ను షేక్ చేసి స్టార్‌గా ఎదిగినా కూడా దేశం మొత్తం రాకీ భాయ్‌గానే గుర్తించింది. కేజీయఫ్ చిత్రంతో యష్ ప్యాన్ ఇండియన్ స్టార్‌గా ఎదిగాడు. సౌత్ ఇండస్ట్రీ స్టామినా నిరూపించిన హీరోల్లో యష్ ఒకడు.

    అయితే యష్ వ్యక్తిగతజీవితం గురించి కూడా అందరూ ఆసక్తిని కనబరుస్తుంటారు. హీరోయిన్ రాధికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు యష్. ఈ ఇద్దరికీ 2016లో వివాహం జరిగింది. వీరికి ఐరా అనే కూతురు కూడా ఉంది. ఇక యష్ ఫ్యామిలీకి సంబంధించిన విశేషాలను ఎక్కువగా రాధిక సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది. రాధిక షేర్ చేసే ఫోటోల కోసం రాకీ భాయ్ ఫ్యాన్స్ ఎదురుచూస్తుంటారు.

    yash son naming ceremony

    నిన్న సాయంత్రం రాధిక ఇచ్చిన ఓ అప్డేట్ కోసం అందరూ ఎదురుచూడసాగారు. నేటి ఉదయం పది గంటలకు జూనియర్ రాకీ భాయ్ నామకరణ వేడుకలు జరుగబోతోన్నాయని రాధిక చేసిన పోస్ట్‌కు విపరీతమైన స్పందన వచ్చింది. రాధిక-యష్‌లకు గతేడాది అక్టోబర్‌లో పండంటి బిడ్డ పుట్టాడు. ఇక ఈ జూనియర్ యష్‌కు నేడు పేరు పెట్టారు. యథర్వ్ అంటూ నామకరణం చేసినట్టు, దానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఎంత ఘనంగా జరిగాయో చూపించే ఓ వీడియోను రాధిక షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో, జూనియర్ యష్ ఫోటోలు తెగ వైరల్ అవుతోన్నాయి.

    English summary
    yash son naming ceremony. Yash and Radhika Pandit welcomed their son in October last year but the naming ceremony was performed recently, as can be seen in the video.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X