Don't Miss!
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్‌ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- News జగన్ పై దాడి ఘటనలో మరో టర్నింగ్ ! వడ్డెర సంఘాల ఎంట్రీ..
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రాకింగ్ స్టార్ యష్ కుమారుడి బారసాల.. ఛోటా రాకీ భాయ్ పిక్స్ వైరల్
కేజీయఫ్ సినిమాతో దేశ వ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకున్నాడు కన్నడ రాకింగ్ స్టార్ యష్., అంతకు ముందు కన్నడ పరిశ్రమలో సూపర్ హిట్స్ అందించి, బాక్సాఫీస్‌ను షేక్ చేసి స్టార్‌గా ఎదిగినా కూడా దేశం మొత్తం రాకీ భాయ్‌గానే గుర్తించింది. కేజీయఫ్ చిత్రంతో యష్ ప్యాన్ ఇండియన్ స్టార్‌గా ఎదిగాడు. సౌత్ ఇండస్ట్రీ స్టామినా నిరూపించిన హీరోల్లో యష్ ఒకడు.
అయితే యష్ వ్యక్తిగతజీవితం గురించి కూడా అందరూ ఆసక్తిని కనబరుస్తుంటారు. హీరోయిన్ రాధికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు యష్. ఈ ఇద్దరికీ 2016లో వివాహం జరిగింది. వీరికి ఐరా అనే కూతురు కూడా ఉంది. ఇక యష్ ఫ్యామిలీకి సంబంధించిన విశేషాలను ఎక్కువగా రాధిక సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది. రాధిక షేర్ చేసే ఫోటోల కోసం రాకీ భాయ్ ఫ్యాన్స్ ఎదురుచూస్తుంటారు.
నిన్న సాయంత్రం రాధిక ఇచ్చిన ఓ అప్డేట్ కోసం అందరూ ఎదురుచూడసాగారు. నేటి ఉదయం పది గంటలకు జూనియర్ రాకీ భాయ్ నామకరణ వేడుకలు జరుగబోతోన్నాయని రాధిక చేసిన పోస్ట్‌కు విపరీతమైన స్పందన వచ్చింది. రాధిక-యష్‌లకు గతేడాది అక్టోబర్‌లో పండంటి బిడ్డ పుట్టాడు. ఇక ఈ జూనియర్ యష్‌కు నేడు పేరు పెట్టారు. యథర్వ్ అంటూ నామకరణం చేసినట్టు, దానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఎంత ఘనంగా జరిగాయో చూపించే ఓ వీడియోను రాధిక షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో, జూనియర్ యష్ ఫోటోలు తెగ వైరల్ అవుతోన్నాయి.