twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    KGF Chapter 2 కోసం మొదలెట్టిన యశ్: బ్యాలెన్స్ వర్క్ కోసం బిజీ అయిన హీరో

    |

    భారతదేశ సినీ చరిత్రలోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం 'కేజీఎఫ్ చాప్టర్ 2'. కన్నడ స్టార్ యశ్ హీరోగా.. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మూడేళ్ల క్రితం విడుదలై.. అన్ని భాషల్లోనూ భారీ విజయాన్ని అందుకున్న 'కేజీఎఫ్'కు ఇది సీక్వెల్‌గా వస్తోంది. ఈ మూవీ షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయినా.. అనివార్య కారణాల వల్ల సినిమా పనులన్నీ పూర్తి కాలేదు. ఈ కారణంగానే ముందుగా అనుకున్న తేదీకి సినిమా వచ్చే అవకాశాలూ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది.

    చిత్రీకరణ భాగం మొత్తం పూర్తవడంతో 'కేజీఎఫ్ చాప్టర్ 2' పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎప్పుడో ప్రారంభం అయ్యాయి. అంతలోనే కరోనా రెండో దశ రావడంతో అవి కాస్తా వాయిదా పడ్డాయి. ఇక, ఇప్పుడు పరిస్థితులు చక్కబడడంతో ఇటీవలే డబ్బింగ్ పార్ట్‌ను మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ఇప్పటికే పలువురు నటీనటులు తమ తమ పాత్రలకు గాత్రాన్ని అందించేశారు. తాజా సమాచారం ప్రకారం.. తాజాగా హీరో యశ్ కూడా డబ్బింగ్‌ను మొదలు పెట్టేశాడట. ప్రస్తుతం బెంగళూరులోని ఓ డబ్బింగ్ థియేటర్‌లో అతడు డైలాగులు చెబుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

    Yash Started KGF Chapter 2 Dubbing

    'కేజీఎఫ్ చాప్టర్ 2'ను అధీరాకు రాఖీ భాయ్‌కు మధ్య జరిగే పోరాటం నేపథ్యంతో రూపొందించారు. ఆ మధ్య విడుదలైన ఈ మూవీ టీజర్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఎన్నో రికార్డులు క్రియేట్ అయ్యాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. హొంబళే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

    English summary
    K.G.F: Chapter 2 is Kannada High Budget Film. Few Days Back This Movie Dubbing Work Started. Hero Yash Recently Started His Work for This Movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X