Just In
- 7 min ago
దానికి రెడీ అంటూ అలీకి షాకిచ్చిన షకీలా: తెలుగు డైరెక్టర్ ఫోన్.. మోసం చేసింది ఆయనంటూ లీక్ చేసింది
- 46 min ago
ఆ డైరెక్టర్ రూంకి పిలిచి అక్కడ తాకాడు.. ప్రైవేట్ పార్టు చూపిస్తూ: టాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు
- 59 min ago
క్రాక్ హిట్టుతో దర్శకుడికి భారీగా రెమ్యునరేషన్.. మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్
- 1 hr ago
మోనాల్‌తో పర్సనల్ సీక్రెట్ లీక్ చేసిన అఖిల్: ఆ బట్టల్లో చాలా హాట్‌గా.. ఊహించని విధంగా కామెంట్స్!
Don't Miss!
- News
బిడెన్‌కు అప్పుడే అభిమానులు పుట్టుకొచ్చారు: బాటిల్లో మినియేచర్: ఎవరీ ఈశ్వర్ రావు: గిఫ్ట్‌గా
- Sports
నాకూ కరోనా వచ్చింది.. వైరస్ జోక్ కాదు: సానియా
- Finance
అది సరిపోదు.. ఇంకా: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు గట్టి షాకిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం!
- Lifestyle
బుధవారం దినఫలాలు : మీన రాశి వారు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు...!
- Automobiles
కుటుంబం కోసం ఆటో డ్రైవర్‌గా మారిన 21 ఏళ్ల అమ్మాయి.. ఎక్కడో తెలుసా ?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మరో పాన్ ఇండియా మూవీలో యశ్: బ్లాక్ బస్టర్ డైరెక్టర్‌ను లైన్‌లో పెట్టేశాడు
కన్నడ చిత్ర పరిశ్రమలో వరుస విజయాలను అందుకుంటూ టాప్ హీరోగా వెలుగొందుతున్నాడు స్టైలిష్ హీరో యశ్. గతంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన అతడు.. ఆ పరిశ్రమ వరకే పరిమితం అయ్యాడు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన 'KGF Chapter 1' అన్ని భాషల్లోనూ భారీ విజయాన్ని దక్కించుకోవడంతో, అతడు కూడా దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ మూవీలో అతడి యాక్టింగ్, బాడీ లాంగ్వేజ్, స్టైల్స్‌కు దక్షిణాదితో పాటు ఉత్తరాది ప్రేక్షకులు సైతం ఫిదా అయిపోయారు.
'KGF Chapter 1' సూపర్ డూపర్ హిట్ అవడంతో దానికి కొనసాగింపుగా 'KGF Chapter 2'ను తెరకెక్కిస్తున్నారు. సినీ ప్రియుల అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా భారీ బడ్జెట్, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే దీని షూటింగ్ చాలా వరకు పూర్తయింది. మిగిలిన క్లైమాక్స్ పార్ట్‌ను హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. ఇందుకోసం చిత్ర హీరో సహా యూనిట్ మొత్తం నగరంలోనే ఉంది. ఆ తర్వాత సుదీర్ఘంగా సాగే షెడ్యూల్‌లో క్లైమాక్స్ ఫైట్ సహా కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారు.

ఈ సినిమా పట్టాలపై ఉండగానే యశ్ మరో పాన్ ఇండియా మూవీని లైన్‌లో పెట్టేశాడని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. కన్నడంలో 'ముఫ్తీ' అనే బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన నార్తాన్‌తో ఈ ప్రాజెక్టు చేయబోతున్నాడట. దీన్ని కూడా కన్నడం, తమిళం, మలయాళం, తెలుగు, హిందీ భాషల్లో రూపొందించనున్నారని సమాచారం. నార్తాన్ ప్రస్తుతం శింబు హీరోగా 'ముఫ్తీ' తమిళ రీమేక్ చేస్తున్నారు. ఇది జనవరి కల్లా పూర్తి చేసి, వచ్చే ఏడాది ప్రథమార్ధం నుంచి యశ్ సినిమాను పట్టాలెక్కించనున్నారని సమాచారం.