మరో టాలెంటెడ్ దర్శకుడికి యష్ గ్రీన్ సిగ్నల్.. పాన్ ఇండియాకు తగ్గట్టుగా బిగ్ ప్లాన్

కన్నడ స్టార్ హీరో యశ్ గురించి మనందరికీ తెలిసిందే. కేజిఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు. దేశవ్యాప్తంగా భారీగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ సిరీస్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా రికార్డు స్థాయిలో బాక్సాఫీస్ ముందు కలెక్షన్ల సునామీని సృష్టించాడు. ఇకపోతే ఈ సినిమా తర్వాత యశ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి, ఏ సినిమాలు చేస్తాడు అన్న విషయాలపై గత కొంతకాలంగా సందిగ్దత నెలకొంది.

యశ్ తన తరువాతి సినిమాను ఏ దర్శకుడితో పని చేస్తారనే దానిపై చాలా వార్తలు వచ్చాయి. కేజీఎఫ్ తర్వాత అనేక మంది నిర్మాతలు, దర్శకులు అతడి ఇంటి ముందు క్యూ కట్టారు. రామ్ చరణ్‌తో సినిమా చేస్తున్న కన్నడ చిత్రనిర్మాత నర్తన్‌తో యష్ చిత్రం ఉంటుందని కూడా వార్తలు వచ్చాయి. అయితే అందులో నిజం లేదని తెలుస్తుంది. అయితే తాజాగా కన్నడ దర్శకుడు సినిమాకి యశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Yash upcoming pan india project with star director latest update

యష్ కబ్జా దర్శకుడు ఆర్ చంద్రుతో కలిసి పని చేస్తాడని వార్తలు వచ్చాయి. ఈ సినిమా అధికారికంగా ఏప్రిల్‌లో ప్రకటిస్తారని యశ్ సన్నిహిత వర్గాల సమాచారం. యశ్ కోసం స్క్రిప్ట్ కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కానుందని సమాచారం. ఈ సినిమా కోసం యశ్ కి తగినట్లు కథను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

Yash upcoming pan india project with star director latest update

ఇక ప్రస్తుతం ఆర్ చంద్రు కబ్జా అనే సినిమా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో స్టార్ హీరో ఉపేంద్ర హీరోగా నటిస్తుండగా చాలాకాలం తర్వాత శ్రియ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది. మార్చి 17న ప్రపంచవ్యాప్తంగా తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత రాకింగ్ స్టార్ యశ్ తో చంద్రు సినిమా స్టార్ట్ చేయనున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం దీనిపై అధికారిక ప్రకటన ఏప్రిల్ లో తెలుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X