For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యష్ కుమారుడిని వదలని రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన రాధిక పండిట్

    |

    కేజీఎఫ్‌తో దేశవ్యాప్తంగా భారీ క్రేజ్‌ను సంపాదించుకొన్న రాకింగ్ స్టార్ యష్‌ ఫ్యాన్స్‌కు అక్టోబర్‌ నెల మరో శుభవార్తను అందించింది. గతేడాది అక్టోబర్‌లో యష్, రాధిక పండిట్ దంపతులు పండంటి బాబుకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ బాబుకు ఇంకా పేరు పెట్టకపోవడంపై అనేక సందేహాలు, రూమర్లు మీడియాలో చోటుచేసుకొంటున్నాయి. యష్, రాధిక దంపతులు తన బాబుకు ఆయుష్ అని పేరు పెట్టినట్టు ఓ వార్త తెగ ప్రచారం అవుతున్నది. దీంతో యష్ దంపతులు తమ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.

    తన కుమారుడి నామకరణంపై యష్ భార్య రాధిక పండిట్ స్పందిస్తూ.. శుభోదయం. చాలా మంది మీ అబ్బాయికి ఏం పేరు పెట్టారు అని ప్రశ్నలతో ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. అయితే ఇంకా మా అబ్బాయికి పేరు పెట్టలేదు. ఒకవేళ పేరు పెట్టే విషయంపై క్లారిటీ వస్తే మీకే ముందు ఆ వార్తను అందిస్తాం. అయితే మీడియాలో వస్తున్నట్టు మా అబ్బాయికి ఆయుష్ అని పేరుపెట్టలేదు. అవన్నీ అవాస్తవాలే. వాటిలో వాస్తవం లేదు అని స్పష్టం చేశారు.

    Yash wife Radhika Pandit given clarity on her Sons name

    యష్‌ దంపతులకు ఇప్పటికే ఐరా అనే కూతురు ఉన్న సంగతి తెలిసిందే. ఇద్దరు పిల్లలను భగవంతుడు ప్రసాదించడాన్ని వరంగా భావిస్తున్నాం. ఇద్దరి సంతానంతో నేను హ్యాపీగా ఉన్నాం అంటూ తన ఆనందాన్ని గతంలో పంచుకొన్నారు.

    Yash wife Radhika Pandit given clarity on her Sons name

    కేజీఎఫ్ చాప్టర్ 1 లాంటి భారీ విజయం అందుకొన్న చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రంలో యష్ నటిస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ లాక్‌డౌన్ కారణంగా ఆగిపోయింది. ఆగస్టు 26వ తేదీ నుంచి కేజీఎఫ్2 చిత్ర షూటింగును ప్రశాంత్ నీల్ ప్రారంభించనున్నారు.

    English summary
    KGF fame, Rocking star Yash wife Radhika Pandit given clarity on her Son's name. She has written her instagram that, Morning dose of happiness. Replying to one of the most asked questions. Finally Junior is getting a name soon!! Will keep u guys updated 😊. #radhikapandit #nimmaRP P.S: His name is not Ayush.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X