తొందరలేదు... అలా జరిగిపోయింది.. ప్రెగ్నెన్సీపై యష్ భార్య క్లారిటీ

Recommended Video

KGF star Yash’s Wife Radhika Pandit Reacts On Their Second Child || Filmibeat Telugu

సంచలన చిత్రం కేజీఎఫ్‌తో క్రేజీ హీరోగా మారిన కన్నడ హీరో యష్ దంపతులు రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు సోషల్ మీడియాలో ప్రకటన చేశారు. తన ఏడాదిలోపు కూతురు వీడియో పెట్టి రెండోసారి గర్భం దాల్చిన విషయాన్ని యష్ భార్య రాధిక పండిట్ కొత్తగా వెల్లడించారు. వీడియోలో కూతురుతో .. నా తల్లిదండ్రులు రెండో బిడ్డకు జన్మను ప్రసాదించబోతున్నారు అని వెల్లడించినట్టు ఓ శుభవార్తను తెలిపారు. ఈ రెండో ప్రెగ్నెన్సీపై రాధిక పండిట్ మాట్లాడుతూ..

త్వరగా రెండో బిడ్డకు జన్మనివ్వాలని

త్వరగా రెండో బిడ్డకు జన్మనివ్వాలని

యష్, నేను ఇద్దరు పిల్లలను కనాలని మొదటి నుంచి కోరుకొంటున్నాం. త్వరగా రెండో బిడ్డకు సంతానం ఇవ్వాలని కూడా డిసైడ్ అయ్యాం. రెండోసారి గర్భం దాల్చినట్టు తెలియగానే చాలా థ్రిల్ అయ్యాం. భగవంతుడి కృప అని భావిస్తాం. మమల్మి ప్రేమించే ప్రతీ ఒక్కరి కోసం ఈ శుభవార్తను అందించడం హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అని రాధిక పండిట్ అన్నారు.

 రెండో సంతానం కోసం ఆతృతగా

రెండో సంతానం కోసం ఆతృతగా

రెండో బిడ్డ రాక కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నాం. ఈ వార్త మా కుటుంబంలో సంతోషాన్ని నింపింది. చిన్నారి మా కుటుంబంలో ఎప్పుడు భాగస్వామి అవుతాడా అనే చాలా క్యూరియాసిటిని కలిగిస్తున్నది. ప్రస్తుతం మా ఇంట్లో పండుగ వాతావరణం నెలకొన్నది అని రాధిక పండిట్ తెలిపారు.

 క్రియేటివ్ ఫీల్డ్‌‌లో ఉన్నాం కాబట్టి

క్రియేటివ్ ఫీల్డ్‌‌లో ఉన్నాం కాబట్టి

మా కుటుంబం క్రియేటివ్ ఫీల్డ్‌తో ఉన్నాం కాబట్టి.. వీడియోరూపంలో నా కూతురితో చెప్పించినట్టు ప్లాన్ చేశాం. ఇన్స్‌టాగ్రామ్‌లో వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మా నిశ్చితార్థం నుంచి పెళ్లి వరకు ప్రతీ వార్తను ఇలా సృజనాత్మకతో పంచుకొన్నాం. ఇలాంటి వార్తలు షేర్ చేసుకోవడం ద్వారా మన సంతోషం రెండింతలు అవుతుంది అని రాధిక పండిట్ పేర్కొన్నారు.

 త్వరలోనే కేజీఎఫ్2

త్వరలోనే కేజీఎఫ్2

గతేడాది రిలీజైన కేజీఎఫ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు సాధించింది. కన్నడలోనే రూ.100 కోట్లకుపైగా వసూలు చేసింది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా వసూలు చేసింది. కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా మరో చిత్రం రాబోతున్నది. ఈ చిత్రాన్ని జాతీయ ప్రాజెక్ట్‌గా మలచడంతో బాలీవుడ్ ప్రముఖులు పలువురు నటిస్తున్నారు. త్వరలోనే కేజీఎఫ్2 ప్రేక్షకుల ముందు రానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X