Just In
- 10 hrs ago
ట్రెండింగ్ : అవే ఆడదాని ఆయుధాలు.. అక్కడ పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు.. మళ్లీ రెచ్చిపోయిన శ్రీరెడ్డి
- 10 hrs ago
బాత్ టబ్ పిక్‌తో రచ్చ.. లైవ్‌కి వస్తాను.. వనిత విజయ్ కుమార్ పోస్ట్ వైరల్
- 12 hrs ago
అది సంప్రదాయంగా ఎప్పుడు మారింది.. యాంకర్ రష్మీ ఆవేదన
- 12 hrs ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
Don't Miss!
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు జనవరి 17వ తేదీ నుండి 23వ తేదీ వరకు
- Automobiles
ఒంటె వల్ల మరణించిన ప్రముఖ బైక్ రైడర్.. ఎవరో తెలుసా!
- News
జేఈఈ మెయిన్స్ దరఖాస్తుల గడువు పొడిగింపు: ఎప్పటి వరకంటే..?
- Finance
రూ.49,000 దిగువన బంగారం ధరలు, రూ.1650 తగ్గిన వెండి
- Sports
పశ్చాత్తాపం అస్సలు లేదు.. నిర్లక్ష్య షాట్‌పై రోహిత్ వివరణ!!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హైదరాబాద్ వస్తున్న రాఖీ భాయ్: ఇక్కడే అన్ని లెక్కలూ తేల్చేస్తాడట
కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి రూపొంది దేశ వ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోనూ సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిన చిత్రం 'KGF Chapter 1', శాండిల్‌వుడ్ సూపర్ స్టార్ యశ్ నటించిన ఈ సినిమా కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది. అంతేకాదు, ఆ మధ్య ప్రకటించిన జాతీయ చలన చిత్ర అవార్డుల్లో బెస్ట్ యాక్షన్ విభాగంలో చోటు దక్కించుకుంది. ఇండియన్ సినిమాపై ఇంతటి ప్రభావాన్ని చూపిన ఈ సినిమాకు సీక్వెల్ రూపొందిస్తున్నాడు స్టైలష్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.
మొదటి పార్ట్ సూపర్ డూపర్ హిట్ అవడంతో 'KGF Chapter 2' పైనా ఆసక్తి పెరిగిపోయింది. సినీ ప్రియుల అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా భారీ బడ్జెట్, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే దీని షూటింగ్ చాలా వరకు పూర్తయింది. మిగిలిన క్లైమాక్స్ పార్ట్‌ను హైదరాబాద్‌లో చిత్రీకరించనున్నారు. ఇందుకోసం చిత్ర హీరో సహా యూనిట్ మొత్తం గురువారం నగరానికి చేరుకోనుంది. ఆ తర్వాత సుదీర్ఘంగా సాగే షెడ్యూల్‌లో క్లైమాక్స్ ఫైట్ సహా కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారు.

'KGF Chapter 2' అనే పేరుతో రాబోతున్న ఈ సినిమాను.. మొదటి పార్టుకు మించి రూపొందిస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. దీన్ని కూడా పాన్ ఇండియా రేంజ్‌తో తెరకెక్కిస్తున్నాడు. అందుకే ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో బాలీవుడ్ నటులు సంజయ్ దత్, రవీనా టాండన్ సహా ఎంతో మంది ప్రముఖులు నటిస్తున్నారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా చేస్తోంది. ఇక, ఈ సినిమా రిలీజ్ విషయానికొస్తే.. దీన్ని మొదట 2021 సంక్రాంతికి విడుదల చేయాలని భావించారు. కానీ, కరోనా ప్రభావంతో దాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.