అందరికీ షాక్, నెటిజన్లు ఫిదా.. అల్లు అర్జున్‌లా మారిపోయిన సీఎం కొడుకు.. దంచి కొడుతున్నాడు!
Recommended Video

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కొడుకు నిఖిల్ కుమార్ సినీ అభిమానులకు గుర్తుండే ఉంటాడు. రెండేళ్ల క్రితం విడుదలైన జాగ్వార్ చిత్రంలోతో నిఖిల్ హీరోగా పరిచయం అయ్యాడు. ఆ చిత్రం కోసం చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. అయినా కూడా జాగ్వార్ చిత్రం మెప్పించలేకపోయింది. తాజాగా ఈ యంగ్ హీరో సీతారామ కల్యాణ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంతో నిఖిల్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయాడు. నిఖిల్ జోరు చూసి అందరూ షాక్ కి గురవుతున్నారు. ఇతగాడి జోరులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రభావం ఉంది.

ట్రెండింగ్ లో నంబర్ 1
సీతారామ కల్యాణ చిత్ర టీజర్ ఇటీవల విడుదలయింది. కేవలం 1 రోజులోనే ఈ టీజర్ 3 మిలియన్ వ్యూస్ దాటేసింది. అభిమానులకే కాదు స్టార్ హీరోలకు సైతం ఇది షాక్. ఇంకా ఒక్క హిట్టు కూడా పడని నిఖిల్ సోషల్ మీడియాలో ఇంతలా హాట్ టాపిక్ గా మారడానికి కారణం ఉంది.
దంచి కొట్టుడు
టీజర్ లో నిఖిల్ పెర్ఫామ్ చేసిన యాక్షన్ సీన్స్ కన్నడ అభిమానులకు షాక్ ఇచ్చే విధంగా ఉన్నాయి. ఊర మాస్ యాటిట్యూడ్ తో నిఖిల్ దంచి కొడుతున్నాడు. కన్నడ అభిమానులకు కొత్త అనిపించినా, తెలుగు వారు మాత్రం ఆ టెక్నిక్ ని వెంటనే పసిగట్టేస్తున్నారు. టీజర్ లో నిఖిల్ ని చూసినట్లు లేదు.. అల్లు అర్జున్ ని చూసినట్లు ఉంది.

సరైనోడు ఫైట్స్
టీజర్ చూసిన టాలీవుడ్ ఫాన్స్ అంతా ఈ చిత్రం సరైనోడు రీమేకా అని అడుగుతున్నారు. పూర్తి స్థాయి రీమేక్ అయితే కాదు కానీ సరైనోడు చిత్రంలో ఫైట్స్, బన్నీ యాటిట్యూడ్ ని ఈ చిత్రంలో వాడుకున్నారు. నిఖిల్ అల్లు అర్జున్ యాటిట్యూడ్ తో చెలరేగిపోతున్నారు.

ఇంటర్వెల్ ఫైట్
సరైనోడు చిత్రంలో ఇంటర్వెల్ ఫైట్ సీన్ మాస్ అభిమానులకు విందు భోజనం లాంటిది. ఆ ఫైట్ లో బన్నీ మేనరిజమ్స్ ని నిఖిల్ దించేశాడు. అందువలనే ఈ టీజర్ యూట్యూబ్ ట్రేండింగ్ లో మొదటి స్థానంలో ఉంది. ఇప్పటికే 3 మిలియన్ వ్యూస్ దాటేసింది.

కుమారస్వామి స్వయంగా
ముఖ్యమంత్రి కుమారస్వామి ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. నిఖిల్ తల్లి అనిత కుమారస్వామి ఈ చిత్రానికి నిర్మాత. హర్ష దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి పాపులర్ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











