twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పునీత్ రాజ్ కుమార్ చనిపోతే దారుణ కామెంట్లు.. యువకుడిని వెంటాడి అరెస్ట్ చేసిన పోలీసులు

    |

    కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌ కుమార్‌ హఠాన్మరణం కేవలం కన్నడ సినిమా ఇండసస్ట్రీనే కాక దక్షిణాది సినిమా ఇండస్ట్రీని శోకసంద్రంలోకి నెట్టింది. పునీత్‌ చేసిన సినిమాల కంటే ముఖ్యంగా ఆయన చేసిన సమాజిక సేవ అందరి హృదయాల్లో చెరగని ముద్ర వేశాయి. అయితే ఆయన మరణించారు అని యావత్ దక్షిణ భారతదేశమంతా బాధపడుతుంటే ఒక యువకుడు మాత్రం ఎంజాయ్ చేస్తున్నట్లు గా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సంచలనంగా మారింది పోలీసులు అతడిని వెంటాడి అరెస్ట్ చేశారు ఆ వివరాల్లోకి వెళితే

     చనిపోయాక కూడా

    చనిపోయాక కూడా

    భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు పునీత్‌ రాజ్ కుమార్‌. ఆయన మరణించే వరకూ తెలియని వారు సైతం మరణించిన తర్వాత పునీత్ రాజ్కుమార్ చేసిన సినిమాలు ఆయన చేసిన సేవ తెలుసుకొని ఆయనకు ఫాన్స్ గా మారిపోయారు. తెలుగు ఇండస్ట్రీ తారలు, సెలబ్రిటీలు సైతం పునీత్‌ రాజ్‌ కుమార్‌ చివరి చూపు కోసం బెంగళూరు వెళ్లి ఆయన అన్న శివ రాజ్ కుమార్ ని ఓదార్చి వచ్చారు అంటే ఆయన ఎంత గొప్ప మనిషిగా మనం అర్థం చేసుకోవచ్చు.

    30 లక్షల మంది

    30 లక్షల మంది

    పునీత్ రాజ్ కుమార్ భౌతికకాయాన్ని ఉంచిన కంఠీరవ స్టేడియానికి లక్షల్లో అభిమానులు వచ్చిన విషయం తెలిసిందే. దాదాపు 30 లక్షల మంది పునీత్‌ పార్థీవదేహానికి నివాళులర్పించినట్లు ఒక అంచనా. మరో విషయం ఏమిటంటే స్టేడియం బయట లక్షల్లో పాదరక్షలు తీసిన కార్పొరేషన్‌ సిబ్బంది ఆ చెప్పు లే సుమారు 10 లక్షల జతలు ఉంటాయని వెల్లడించారు.

     చెప్పులు విడిచి

    చెప్పులు విడిచి

    పునీత్‌ రాజ్‌ కుమార్‌ చివరి చూపు కోసం వచ్చిన అభిమానులు అందరూ స్టేడియంలోనికి ఆయన భౌతిక కాయాన్ని సందర్శించేందుకు వెళ్లారు. అయితే వారిలో ఏ ఒక్క అభిమాని కూడా చెప్పులు వేసుకుని లోపలికి వెళ్లలేదంటే ఆయన మీద ఎంత గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చు. అందరూ తమ పాదరక్షలు స్టేడియం బయటనే వదిలి వెళ్లారు. ఒక దేవాలయానికి వెళ్లే సమయంలో ఎలా అయితే చెప్పులు బయట వదిలి వెళ్లారో.. అలాగే పునీత్‌ పార్థీవదేహాన్ని చూసేందుకు అభిమానులు అలా వెళ్లారు. కొందరు తిరిగివచ్చి వాటిని తీసుకుని వెళ్లగా కొందరు మాత్రం వదిలేశారు.

     అంతటి గౌరవమా?

    అంతటి గౌరవమా?

    ఆ చెప్పులను కార్పొరేషన్ సిబ్బంది తొలగిస్తున్న దృశ్యాలు అందరినీ భావోద్వోగానికి గురి చేస్తున్నాయి. ఒక నటుడు అంటే ఇంతటి అభిమానమా? ఇంతటి గౌరవమా? అంటూ కొందరు ఆశ్చర్యపోతున్నారు. అదంతా కేవలం తన నటన, డాన్సుతో సంపాదించింది కాదు. అది ఒక మనిషిగా సమాజానికి పునీత్‌ చేసిన సేవ వల్ల వచ్చిన అభిమానం. అంటూ సోషల్‌ మీడియాలో ప్రశంసిస్తున్నారు.

     రాయలేని విధంగా బూతులు

    రాయలేని విధంగా బూతులు

    అయితే శుక్రవారం గుండెపోటు కారణంగా పునీత్ అకాల మరణానికి వేలాది మంది అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నప్పుడు, రిత్విక్‌గా గుర్తించబడిన ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారు ఒక పోస్ట్‌లో ఇలా వ్రాశారు ".... మమ్మల్ని ఆపలేరు" అంటూ రాయలేని విధంగా అసభ్యకరంగా పోస్ట్ చేశాడు. అంతే కాక ఫోటోలు అప్‌లోడ్ చేస్తున్నప్పుడు అందులో అతను మరియు అతని స్నేహితుడు బీర్ బాటిల్ పట్టుకుని కనిపించారు.

    Recommended Video

    Natyam Movie Review By Nandamuri Balakrishna
    వెంటాడి అరెస్ట్

    వెంటాడి అరెస్ట్

    ఈ అనుచిత వ్యాఖ్యలు అప్పు అభిమానుల మనోభావాలను దెబ్బతీశాయి దీంతో అనేక మంది నెటిజన్లు పోస్ట్ యొక్క స్క్రీన్‌ షాట్‌లను తీసి, నిందితులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బెంగళూరు సిటీ పోలీస్ మరియు సిటీ పోలీస్ కమిషనర్ కమల్ పంత్‌ను ట్యాగ్ చేశారు. దీంతో అప్రమత్తమైన నగర పోలీసులు నిందితుడి ఆచూకీ కోసం సైబర్ క్రైమ్ వింగ్‌కు సమాచారం అందించారు. అలా పోలీసులు వెంటాడి వేటాడి నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడిని అరెస్టు చేశామని, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని కమల్ పంత్ ట్వీట్‌లో తెలిపారు.

    English summary
    youngster named Rithvik arrested in Bangalore for making derogatory comments on Puneeth Rajkumar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X