అగ్గి రాజేసుకుంది.. ఆ ముగ్గురు నటీమణులతో పాటు మరో 100 మంది కూడా!
మలయాళీ చిత్ర పరిశ్రమలో ముసలం రేగింది. ప్రముఖ నటుడు దిలీప్ కు వ్యతిరేకంగా అంతా ఏకం అవుతున్నారు. మలయాళంమూవీ అసోసియేషన్ సభ్యులంతా ఏకం అవుతున్నారు. ప్రముఖ మలయాళీ నటిని లైంగికంగా వేధించిన ఘటనలో నటుడు దిలీప్ పై ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన సమయంలో దిలీప్ పై మలయాళీ మూవీ అసోసియేషన్ అతడిపై వేటు విధించింది. తాజగా అతడిని అసోసియేషన్ లోకి తిరిగి చేర్చుకోవడంతో అగ్గి రాజేసుకుంది.
Recommended Video


భగ్గుమంటున్న మహిళా నటులు
మలయాళీ మూవీ అసోసియేషన్ లోకి దిలీప్ ని తిరిగి చేర్చుకోవడంపై మహిళా నటులు మండి పడుతున్నారు. సీనియర్ నటి రేవతి, పార్వతి, పద్మప్రియ వంటి వారంతా వ్యతిరేకిస్తున్నారు.

మరో 100 మంది కూడా
వీరితో పాటు మరో 100 మంది నటులు మలయాళీ మూవీ సోసియేషన్ నుంచి సభ్యత్వాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనితో తాజాగా మలయాళీ చిత్ర పరిశ్రమలో ముసలం మొదలైనట్లు అయింది.

అందరి నిర్ణయంతోనే
ప్రముఖ నటుడు మోహన్ లాల్ ఈ వివాదంపై ఎట్టకేలకు స్పందించారు. దిలీప్ కు తిరిగి సభ్యత్వం కల్పించాలనే నిర్ణయం అసోసియేషన్ లో సభ్యులంతా ఏకగ్రీవంగా తీసుకున్నారని మోహన్ లాల్ తెలిపారు.

అసోసియేషన్ నాశనం చేయాలనే ప్రయత్నం
కొందరు అనవసరంగా ఈ విషయాన్ని హైలైట్ చేస్తున్నారని, అసోసియేషన్ ని నాశనం చేయాలనుకునే వారి పనే ఇది అని మోహన్ లాల్ అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications











