2024లో 199 సినిమాలు.. 1000 కోట్ల బడ్జెట్, 700 కోట్ల నష్టం.. ఏ ఇండస్ట్రీయో తెలుసా?
దాదాపు ఈ 2024 ఏడాది పూర్తి అయ్యిపోయింది. ఇంకొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం కొత్త కొత్త సినిమాలతో అంతా మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ కానుంది. అయితే ఈ 2024లో ఇండియా వైడ్ గా అనేక భాషల్లో ఎన్నెన్నో చిత్రాలు రిలీజ్ కి వచ్చి ఆడియెన్స్ ని అలరించాయి. ఇలా వచ్చిన ఎన్నెన్నో చిత్రాల్లో ఎన్నో భాషల్లో ఆడియెన్స్ వందలు వేల కొద్దీ సినిమాలు చూసి ఉండొచ్చు.
అలాగే ఒకో భాషకి చెందిన సినీ పరిశ్రమ నుంచి వందల చిత్రాలు వచ్చి వేల కోట్ల వసూళ్ళని కేవలం ఈ ఒక్క ఏడాదిలోనే అందుకున్నాయి. కాగా ఈ ఏడాది ముగుస్తున్న సమయంలో కొన్ని రిపోర్ట్స్ అయితే బయటకి వస్తున్నాయి. ఇలా వచ్చిన రిపోర్ట్స్ లో కొన్ని షాకింగ్ ఫ్యాక్స్ కూడా కనిపిస్తున్నాయి. మరి ఇలా వచ్చిన ఓ లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం ఓ ప్రముఖ ఇండస్ట్రీ భారీగా నష్టాలు చూసినట్టుగా తెలుస్తుంది.

వారు ఈ ఏడాదిలో ఏకంగా 199 సినిమాలు రిలీజ్ చేస్తే వాటి అన్నిటి బడ్జెట్ కలిపి 1000 కోట్లకి పైగా అయ్యిందట. కానీ ఆ అన్ని సినిమాల్లో కేవలం పెట్టిన బడ్జెట్ కి 300 కోట్ల రూపాయలు మాత్రమే వెనక్కి వచ్చి.. సదరు సినీ పరిశ్రమ ఏకంగా 700 కోట్లు నష్టాలు చూసినట్టుగా రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఆ ఇండస్ట్రీ ఏదో కూడా కాదు మన తెలుగు ఆడియెన్స్ కూడా ఇష్టమైన మలయాళ సినీ పరిశ్రమ అట.
మలయాళ సినిమా అంటేనే చాలా మంది ఆసక్తి చూపిస్తారు. అక్కడ కంటెంట్ అలా ఉంటుంది మరి. అలాంటి ఇండస్ట్రీకి ఏకంగా 700 కోట్ల లాస్ అంటే ప్రేక్షకులు, పరిశ్రమ వర్గాలు షాక్ అవుతున్నాయి. మల్లూవుడ్ ఈ ఏడాదిలో మొత్తం 199 సినిమాలు రిలీజ్ చేస్తే అందులో కేవలం 26 సినిమాలు మాత్రమే లాభాలు తెచ్చి పెట్టాయట. దీనితో మిగతా అంతా నష్టమే అని నిర్మాతలు వాపోతున్నారట. అయితే దీనికి పరిష్కారంగా అక్కడి ఇండస్ట్రీ వారు ఓ డిమాండ్ ని కూడా గట్టిగా చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

మలయాళ సినిమాలో ఉన్న స్టార్స్ రెమ్యునరేషన్ తగ్గించుకుంటేనే తాము ఇలాంటి నష్టాల నుంచి బయట పడతామని వారు చెబుతున్నారట. మరి ఇదే కామెంట్స్ మన తెలుగు హీరోలపై చాలా మంది చేస్తుంటారు. దానికి కొందరు నెటిజన్స్ కూడా సపోర్ట్ చేస్తారు. కానీ ఇపుడు మలయాళ సినిమా కూడా దాదాపు ఇదే పరిస్థితి ఎదుర్కోవడం అనేది అందరికీ ఒకింత ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది.
మరి మళయాళం నుంచి ఈ ఏడాదిలో తెలుగులో పలు సినిమాలు డబ్ అయ్యాయి. ఈ 2024 స్టార్టింగ్ లోనే ఫిబ్రవరి నుంచి వరుస భారీ హిట్స్ ని మలయాళ సినిమా చూసింది. అలాగే ఎపుడు చూడని రికార్డు వసూళ్లు కూడా మలయాళ సినిమాకి ఈ ఏడాదిలోనే దక్కాయి. బ్రహ్మయుగం, ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్, ది గోట్ లైఫ్, ఇలా చాలా సినిమాలు భారీ హిట్స్ అయ్యాయి. అయితే లేటెస్ట్ గా మోహన్ లాల్ నటించిన భారీ బడ్జెట్ సినిమా "బరోజ్" ఎఫెక్ట్ ఎక్కువ కనిపించి ఉండొచ్చు అని పరిశ్రమ వర్గాల టాక్. ఇది అనుకున్నదాని కంటే భారీ వ్యయంతో తెరకెక్కి భారీ డిజాస్టర్ గా నిలిచింది.


Click it and Unblock the Notifications











