40 ఏళ్ల ప్రముఖ నటుడు రెండో పెళ్లి.. దసరా విలన్ మ్యారేజ్ విషయంలో ఏం జరిగిందంటే?
సినీ పరిశ్రమకి చెందిన నటీనటుల ప్రొఫిషినల్ లైఫ్ లు చూసేందుకు ఛాయా సౌకర్యంగా హుందాగానే కనిపిస్తాయి మేము కూడా మనుషులమే మాకూ ఓ మనసుంటుంది అంటుంటారు కొందరు.. కాకపోతే రియల్ లైఫ్ లో మాత్రం ఆదర్శంగా కనిపించే నటీనటులు ఒకింత తక్కువే ఉంటారని చెప్పాలి. కొంతమంది తమ పర్శనల్ లైఫ్ లో చాలానే అఫైర్స్.. ఆల్రెడీ పెళ్ళై భార్య ఉన్నా ఇతర పెళ్లిళ్లు సంబంధాలు కూడా గట్టిగానే కనిపిస్తూ ఉంటాయి.
అయితే వారిలో కొంతమంది దొరికేస్తారు కొంతమంది రహస్యంగా మైంటైన్ చేస్తూ ఉంటారు. కాగా సినిమా వాళ్లలో అయితే ఏజ్ తో కూడా ఎలాంటి సంబంధం ఉండదు. చాలా వరకు 50 వయసు ఉన్న హీరోలు, నిర్మాతలు కూడా పెళ్లిళ్లు చేసుకున్న దాఖలాలు ఇటు సౌత్ నుంచి అటు నార్త్ వరకు కూడా ఉన్నాయి. కాగా ఈ లిస్ట్ లో లేటెస్ట్ గా మలయాళ సినిమాకి చెందిన ప్రముఖ నటుడు టాలీవుడ్ సినిమాల్లో విలన్ గా అదరగొట్టిన షైన్ టామ్ చాకో కూడా చేరాడు.

కాగా షైన్ టామ్ చాకో కి ఇపుడు 40 ఏళ్ల వయసు అయితే ఈ 40 లో తాను రెండో పెళ్లికి అది కూడా ప్రేమ పెళ్ళికి సిద్ధం అయ్యాడు కానీ అది కాస్తా ఇప్పుడు బ్రేకప్ అయ్యినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. కాగా షైన్ టామ్ చాకో తన చిన్ననాటి స్నేహితురాలితోనే తన మొదటి భార్యకి విడాకులు ఇచ్చిన తర్వాత నుంచి తనూజతో ప్రేమాయణం సాగిస్తున్నాడట. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారట.
ఇంతేనా ఈ ఏడాదిలోనే జనవరిలో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే షైన్ టామ్ చాకో సింగిల్ అని అంటున్నాడు. దీనితో ఈ ఇద్దరికీ బ్రేకప్ అయ్యిందని వార్తలు మొదలు కాగా తాము ఇద్దరూ ప్రేమించుకున్నప్పటికీ వారి బంధం పెళ్లి వరకు వెళ్లే అంత స్థాయి ప్రేమ కాదని అందుకే ఇద్దరూ బ్రేకప్ చెపుకున్నారని తెలుస్తోంది. కాగా ఇలా మళ్ళీ ఈ వెర్సటైల్ నటుడు సింగిల్ స్టేటస్ లోకి వచ్చేసాడట.

మరి ఈ టాలెంటెడ్ నటుడు తెలుగులో నాని నటించిన సాలిడ్ మాస్ చిత్రం "దసరా" ఏ రేంజ్ లో విలనిజాన్ని చూపించాడో అందరికీ తెలుసు. తర్వాత నాగ శౌర్య రంగబలి లో కూడా విలన్ గా చేసాడు. ఇక తమిళ్ లో విజయ్ దళపతి నటించిన చిత్రం "బీస్ట్" లో సహాయ పాత్ర చేసాడు. ఇలా సౌత్ లో తనకి మంచి పాపులారిటీ ఉంది.
అయితే ఈ నటుడు సినిమాల్లో ఎంత పర్ఫెక్ట్ గా ఉంటాడో బయట లైఫ్ లో మాత్రం అంత వెటకారంగా కనిపిస్తాడు. సోషల్ మీడియాలో కూడా తనపై చాలా ఫన్నీ వీడియోలు కూడా వైరల్ గా మారినవి ఉన్నాయి. మరి ఈ వయసులో తనకి జరిగిన బ్రేకప్ మాత్రం ఒకింత బాధాకరమే అని చెప్పాలి. కాగా ప్రస్తుతం ఈ టాలెంటడ్ నటుడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ భారీ చిత్రం "దేవర" లో కూడా ఒక ముఖ్య పాత్ర చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











