ప్రముఖ నటుడు అరెస్ట్.. మాజీ భార్య ఫిర్యాదుతో జైలుకు!

మలయాళ నటుడు బాలాను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ భార్య చేసిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకొన్న పోలీసులు ఆయనతోపాటు అతడి మేనేజర్‌ను కూడా అదుపులోకి తీసుకొన్నారు. ఈ సంఘటన మలయాళ సినిమా పరివ్రమలో సంచలనం రేపింది. ప్రస్తుతం యాక్టర్ బాలా, ఆయన మేనేజర్‌ను కడవంతర పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. సాయంత్రం లోగా కోర్టులో హాజరుపరిచేందుకు రెడీ అవుతున్నారు. ఈ కేసు వివరాల్లోకి వెళితే..

నటుడు బాలా కొద్ది రోజుల క్రితం తన భార్య అమృతతో విడాకులు తీసుకొన్నారు. వారిద్దిరికి ఓ కూతురు కూడా ఉంది. అయితే వారిద్దరూ విడిపోయినప్పటికీ.. వారి మధ్య మనస్పర్ధలు అలానే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తమ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా, తమ జీవితాన్ని కించపరిచే విధంగా బాలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఆమె కడవంతర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Actor Bala Arrested juvenile Act amid Ex Wife Amrutha files case Violating divorce agreement

బాలా, తనకు మధ్య జరిగిన విడాకుల ఒప్పందాన్ని ఆయన ఉల్లంఘించారు. సోషల్ మీడియాలో తనను, తన 12 ఏళ్ల కూతురిపై పోస్టులు పెడుతూ మా ప్రైవసీ, ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నం చేశారు. మా ఇద్దరిని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. పెయిడ్ ఇంటర్వ్యూలతో మా ప్రైవసీని, మా లైఫ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు అని అమృత తన ఫిర్యాదులో తెలిపారు.

అయితే అమృత ఫిర్యాదును పరిగణనలోకి తీసుకొన్న పోీసులు.. వారిన కోచిలోని బాలా ఫ్లాట్‌ నుంచి రాజేష్‌ను, ఆయనను అరెస్ట్ చేశారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు, అలాగే మైనర్ బాలికపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో కేసు నమోదు చేశారు. జువనైల్ చట్టం కింద నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అని సన్నిహితులు తెలిపారు.

అమృత చేసిన ఫిర్యాదు ఆధారంగా మొత్తం బాలా, రాజేష్‌పైనే కాకుండా మరో వ్యక్తిపై కూడా కేసు నమోదు చేశారనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఇద్దరిపైనే కాకుండా ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ అధినేత అనంత కృష్ణన్‌పై కూడా మూడో నిందితుడిగా కేసు నమోదు చేసినట్టు మీడియాకు పోలీసులు తెలిపారు.

బాలాను అరెస్ట్ చేయాల్సినంత కేసు కాదు. కానీ మాజీ భార్య ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు కావడంతో విచారణకు సహకరించేందుకు పోలీసులకు లొంగిపోయారు. అయితే తనపై నిరాధారమైన ఆరోపణలతో కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాల్సిందిగా నా క్లయింట్ బాలా కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అని బాలా తరుఫు న్యాయవాది తెలిపారు.

More from Filmibeat

Read more about: bala amrutha malayalam
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X