హీరోయిన్‌పై గ్యాంగ్ రేప్.. లైంగిక దాడి కేసులో స్టార్ హీరోకు ఊరట.. కోర్టు సంచలన తీర్పు!

మలయాళ హీరోయిన్‌పై గ్యాంగ్ రేప్ కేసులో స్టార్ హీరో దిలీప్‌కు ఊరట లభించింది. 2017 సంవత్సరంలో నమోదైన లైంగిక దాడి కేసులో ఆయనను నిర్ధోషిగా ప్రకటిస్తూ ఎర్నాకులం ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి తీర్పు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎన్ఎస్ సునీల్ అలియాస్ పల్సర్ సునికు ఈ కేసులో దోషిగా పరిగణిస్తూ న్యాయమూర్తి హానీ ఎం వర్గీస్ సంచలన తీర్పు ఇచ్చారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న వారిలో దిలీప్ 8వ వ్యక్తి కావడం గమనార్హం. ఈ కేసులో 1 నుంచి 6వ ముద్దాయి వరకు దోషులుగా ప్రకటిస్తూ ఎర్నాకులం కోర్టు డిసెంబర్ 8వ తేదీన తీర్పు వెల్లడించింది. తుది తీర్పు 12వ తేదీన కోర్టు వెల్లడించనున్నది. దాంతో 8 ఏళ్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దిలీప్‌కు భారీ ఊరట లభించింది. ఈ కేసు వివరాల్లోకి వెళితే..

మలయాళ హీరోయిన్‌పై గ్యాంగ్ రేప్, నేరపూరిత కుట్ర, దురుద్దేశపూర్వకంగా లైంగిక దాడి, బాధితురాలిపై క్రిమినల్ ఫోర్స్ ఉపయోగించడం, సాక్ష్యాలను రూపు మాపడం, అశ్లీల, అసభ్యకరమైన ఫోటోలను సోషల్ మీడియాలో ప్రచారం చేయడం లాంటి అభియోగాలపై దిలీప్‌పై కేసు నమోదైంది.

Actor Dileep Acquitted from Criminal Charges

మలయాళ హీరోయిన్‌ను ప్రయాణిస్తున్న కారులో బలవంతంగా అదుపులోకి తీసుకొన్నారు. ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు అని ఈ కేసులో పల్సర్ సుని‌ను ప్రధాన నిందితుడుగా ఆరోపిస్తూ కేసు నమోదైంది. ఆ శారీరక దాడి చేసిన సమయంలో సునీల్ తన ఫోనులో ఈ దుశ్చర్యను కూడా రికార్డు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. కారులో ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన తర్వాత నటుడు, దర్శకుడి ఇంటిలో డ్రాప్ చేసి వెళ్లారని ఎఫ్ఐఆర్‌లో కేరల పోలీసుల పేర్కొన్నారు. ఈ కేసులో పాపులర్ యాక్టర్ దిలీప్ ఉండటంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ కేసులో చాలా మంది నటులను కూడా విచారించడం గమనార్హం.

ఈ కేసులో నటుడు సునీల్‌పై దారుణమైన ఆరోపణలు వచ్చాయి. పల్సర్ సునీల్‌తో కుమ్మక్కై బాధితురాలిని వేధించారు. ఆమెను నగ్నంగా వీడియో తీయాలి. లైంగిక దాడి జరిపేటప్పుడు కూడా వీడియో చిత్రీకరించాలి అని సునీల్‌తో దిలీప్ 1.5 కోట్ల మేర ఒప్పందం చేసుకొన్నాడనే ఆరోపణలు వచ్చాయి.ఈ కేసుల మణికందన్, విజీష్, సలీమ్, ప్రదీప్, థామస్, సానిల్ కుమార్ లాంటి వ్యక్తులపై కేసు నమోదైంది. ఈ కేసులో దిలీప్‌ను 2017 జూలై 10వ తేదీన అరెస్ట్ చేశారు. ఈ కేసు విచారణ 2020 జనవరి 30 ప్రారంభమైంది. ఈ కేసును విచారించడానికి స్పెషల్ జడ్జీగా హానీ ఎం వర్గీస్‌ను నియమించారు.

గ్యాంగ్ రేప్ కేసులో తనన నిర్ధోషిగా తీర్పు ఇవ్వడంపై నటుడు దిలీప్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తనపై జరిగిన కుట్ర కోర్టులో ఓడిపోయింది. కొందరు పోలీసులు తనపై ఉద్దేశపూర్వకంగా కుట్ర చేశారు. చివరకు వాస్తవం ఏమిటో బయటకు వచ్చింది అని దిలీప్ అన్నారు. కోర్టు తీర్పు నేపథ్యంలో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి పండుగ చేసుకొన్నారు. ఆనందంలో స్వీట్లు పంచుకొన్నారు.

More from Filmibeat

Read more about: dileep mollywood pulsar suni
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X