Don't Miss!
- News
ప్రతీ ఇంటా "మా నమ్మకం నువ్వే జగన్"...!!
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Sports
INDvsAUS : ఆసీస్‌కు అది అలవాటే.. అది వాళ్ల మైండ్ గేమ్.. అశ్విన్ ఘాటు రిప్లై!
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
నటుడు దిలీప్‌ను అరెస్ట్ చేయొద్దు.. నటిపై లైంగికదాడి కేసులో ఊరట.. కేరళ హైకోర్టు ఆదేశం
మలయాళ నటుడు దిలీప్‌కు కేరళ హైకోర్టులో ఊరట లభించింది. హీరోయిన్‌పై లైంగిక దాడి, కిడ్నాప్‌కు ప్రయత్నించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న అధికారులను చంపడానికి ప్రయత్నించారనే ఆరోపణలు తాజాగా రావడంతో కోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఈ తాజా ఆరోపణలపై దాఖలైన పిటిషన్‌ను కేరళ హైకోర్టు విచారించింది. అయితే నటుడు దిలీప్‌తోపాటు మరో నలుగురికి ఊరట కలిగించే విధంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు విచారణకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

2015 నాటి కేసులో ట్విస్టు
నటిపై దాడి, కిడ్నాప్ కేసులో విచారణ, దర్యాప్తు ముమ్మరంగా సాగుతున్నది. నటుడు దిలీప్‌కు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలను సేకరించాం. 2015 నవంబర్ 15వ తేదీన నటుడు దిలీప్‌పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దర్శకుడు బాలచంద్రకుమార్ ఇచ్చిన వాగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేశాం. నటిపై దాడి, అత్యాచారం కేసులో విచారణ జరుపుతున్న విచారణ అధికారి బైజు పాలోస్, సూపర్‌వైజర్ ఆఫీసర్లను చంపడానికి ప్రయత్నించారు. ఈ కేసులో విచారణ అధికారుల ప్రాణాలకు ముప్పు ఉంది అంటూ దిలీప్‌పై పోలీసులు ఆరోపణలు చేశారు.

మొబైల్ ఫోన్ల స్వాధీనానికి సమన్లు
అంతేకాకుండా కంప్యూటర్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, ఇతర గాడ్జెట్స్ అప్పగించాలని దిలీప్‌కు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. గతంలో విచారణ అధికారులకు అప్పగించలేదు. వాటి ద్వారా మరింత విచారణ చేపట్టాల్సి ఉంది. సాక్ష్యాలను తారుమారు చేయకుండా, డేటా డిలీట్ చేయకుండా ఉండటానికి పరికరాలు స్వాధీనం చేసుకోవాలని అనుకొంటున్నాం. వాటిని ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్‌కు అప్పగించి కేసుకు సంబంధించిన సాక్ష్యాలను సేకరిస్తామని సమన్లలో కేరళ పోలీసులు తెలిపారు.

ముందస్తు బెయిల్‌కు దిలీప్ దరఖాస్తు
అలాగే ఇక విచారణ సమయంలో అధికారులను చంపడానికి ప్రయత్నించిన దిలీప్‌తోపాటు మరొకొందరిని అరెస్ట్ చేయడానికి కోర్టు అనుమతించాలని కేరళ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. దాంతో దిలీప్‌తోపాటు మరికొందరు ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకొన్నారు. తమను అరెస్ట్ కాకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్‌పై కొద్ది రోజులుగా కేసు విచారణ జరుపుతున్నారు. గతవారం రోజులు వారి అరెస్ట్‌కు కేరళ క్రైమ్ బ్రాంచ్ ప్రయత్నించింది.

కేరళ కోర్టు ఆదేశాలతో..
నటిపై లైంగిక దాడి కేసులో భాగంగా దిలీప్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ రిపోర్టును సీల్డ్ కవర్‌లో దాఖలు చేయాలని చెప్పింది. అంతే కాకుండా వారిని జనవరి 27వ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దని కేరళ హైకోర్టు ఆదేశాలు చేసింది. దాంతో పోలీసుల ప్రయత్నాలకు బ్రేక్ పడింది.
Recommended Video

ఫిబ్రవరి 2వ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దు
నటి లైంగిక దాడి, కిడ్నాప్ ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న అధికారులను మట్టుపెట్టడానికి ప్రయత్నించారనే అంశంపై గురువారం (జనవరి 27) విచారణ చేపట్టింది. ఈ కేసులో తదుపరి ఆదేశాల వరకు అంటే ఫిబ్రవరి 2వ తేదీ వరకు ఎలాంటి అరెస్ట్‌లు చేయవద్దని కేరళ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దాంతో దిలీప్‌కు ఈ కేసులో ఊరట లభించింది.