ప్రముఖ విలన్ కన్నుమూత.. విషాదంలో దక్షిణాది సినీ పరిశ్రమ

మలయాళం, తమిళ, కన్నడ చిత్రాల్లో అద్బుతమైన పాత్రలతో ఆకట్టుకొన్న నటుడు కజన్ ఖాన్ ఇకలేరు. సోమవారం గుండెపోటుకు గురైన ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో దక్షిణాది సినిమా పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది. ఆయన ఆకస్మిక మృతిని జీర్ణించుకోలేకపోయిన అభిమానులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు విషాదంలో మునిగిపోయారు. కజన్ ఖాన్ మృతి వివరాల్లోకి వెళితే..

కజన్ ఖాన్ కేరళలో జన్మించారు. కానీ తమిళ సినిమా రంగంలో నటుడిగా ప్రవేశించారు. తొలిసారి ప్రముఖ దర్శకుడు పీ వాసు దర్శకత్వంలో నటించారు. ఆయన చివరి సినిమా లైలా ఓ లైలా. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆయన నటనకు 2015 నుంచి దూరంగా ఉంటున్నారు.

Actor Kazan Khan passed away

కజన్ ఖాన్ కెరీర్ విషయానికి వస్తే.. 1992లో సెంతామిజ్ పాట్టు అనే చిత్రంంలో భూపతి పాత్ర ద్వారా నటజీవితాన్ని ప్రారంభించారు. 1995లో ది కింగ్ అనే చిత్రంలో విక్రమ్ ఘోర్పాండే పాత్రతో అద్బుతమైన గుర్తింపును సొంతం చేసుకొన్నారు. హీరో మమ్ముట్టి నటించిన ఈ చిత్రం ద్వారా మంచి విలనిజాన్ని సొంతం చేసుకొన్నారు. ఆ తర్వాత ఆయనకు మలయాళ సినిమా పరిశ్రమలో ఎదురేలేకుండా పోయింది.

కజన్ ఖాన్ తమిళ, కన్నడ భాషల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తమిళంలో కలైగ్నన్, సేతుపతి ఐపీఎస్, మురళీ మామన్, అనజగన్, కరుప్పు నీల తదితర చిత్రాల్లో నటించారు. అలాగే సీఐడీ మూస, వర్న పాకిట్టు చిత్రాల్లో తనదైన నటనతో మెప్పించారు. దాదాపు 2 దశాబ్దాల కాలంలో సుమారు 50కిపైగా చిత్రాల్లో నటించారు.

కజన్ ఖాన్ మృతి గురించి నిర్మాత ఎన్ఎమ్ బాదుషా సోషల్ మీడియాలో వెల్లడించారు. ప్రముఖ విలన్, నటుడు కజన్ ఖాన్ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన గుండెపోటుతో ఆకస్మిక మరణం పొందారు. ఆయన కుటుంబానికి, మిత్రులు, సన్నిహితులకు నా ప్రగాఢ సంతాపం అని తెలిపారు.

కజన్ ఖాన్ మరణంపై మలయాళ నటుడు దిలీప్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. సీఐడీ మూసా, ఇవన్ మర్యాదరామన్ కలిసి నటించిన విషయాన్ని గుర్తు చేసుకొన్నారు. కజన్ ఖాన్ ఏ లోకాన ఉన్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలిని దిలీప్ తన సంతాప ప్రకటనలో తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X