లూసిఫర్ దర్శకుడికి తీరిన కష్టాలు.. జోర్డాన్ ఎడారిలో చిక్కుకొని.. ఎట్టకేలకు ఫ్యామిలీతో..

మలయాళ నటుడు, దర్శకుడు, నిర్మాత పృథ్వీరాజ్ సుకుమారన్‌కు కరోనా కష్టాలు తీరాయి. దాదాపు రెండు నెలల తర్వాత ఆయన స్వేచ్ఛా ప్రపంచంలోకి అడుగుపెట్టారు. భార్య, పిల్లలను కలుకొని సంతోషంలో మునిగిపోయారు. తమ అభిమాన నటుడు సురక్షితంగా ఇంటికి చేరడంపై అభిమానులు సందేశాలతో ప్రశంసలు గుప్పిస్తున్నారు. గత రెండు నెలలుగా పృథ్వీరాజ్ సుకుమారన్ ఎందుకు కుటుంబానికి దూరంగా ఉన్నారంటే..

జోర్డాన్ ఏడారిలో చిక్కుకుపోయి

జోర్డాన్ ఏడారిలో చిక్కుకుపోయి

లాక్‌డౌన్‌కు ముందు ఆడుజీవితం అనే సిసిమా షూటింగ్‌ కోసం విదేశాలకు వెళ్లిన పృథ్వీరాజ్ తన 58 మంది యూనిట్‌తో సహ అక్కడే చిక్కుకుపోయారు. గత రెండు నెలలుగా జోర్డాన్‌లోని వాడి రమ్ ఎడారిలోనే చిక్కుకుపోయారు. లాక్‌డౌన్ సడలింపుల తర్వాత మే 22న సినిమా యూనిట్ అంతా వందే భారత్ మిషన్ ద్వారా కేరళకు చేరుకొన్నారు. అయితే ఓ సభ్యుడికి కరోనా పాజిటివ్ అనే తేలడంతో వీరందరిని క్వారంటైన్‌కు పంపాల్సి వచ్చింది.

రెండు వారాల క్వారంటైన్

రెండు వారాల క్వారంటైన్

కేరళకు చేరుకొన్న తర్వాత పృథ్వీరాజ్‌తో సహా 58 మంది కోవిడ్ నిబంధనల ప్రకారం రెండు వారాల క్వారంటైన్ వాసాన్ని గడిపారు. నిబంధనల ప్రకారం ఇటీవల ఆయనకు కరోనా గుర్తింపు నివారణ పరీక్షలు నిర్వహించారు. ఆ కరోనా పరీక్షల రిపోర్టులో నెగిటివ్ అని తేలింది. దాంతో రెండు వారాల స్వీయ గృహ నిర్బంధం అనంతరం ఆయన ఇంటికి చేరుకొన్నారు.

 ఫ్యామిలీని కలుసుకొన్న ఫృథ్వీరాజ్

ఫ్యామిలీని కలుసుకొన్న ఫృథ్వీరాజ్

రెండు వారాల క్వారెంటైన్ జీవితం తర్వాత నటుడు పృథ్వీరాజ్ ఇంటికి చేరుకొని తన భార్య సుప్రియ మీనన్, ఐదేళ్ల కూతురు అలంకృతను కలుసుకొన్నారు. వారిని ప్రేమతో కౌగిలించుకొని అనురాగాన్ని పంచారు. ఈ విషయాన్ని, ఫృథ్వీరాజ్ తన కుటుంబంతో కలిసి ఉన్న ఫోటోను లూసిఫర్ దర్శకుడైన పృథ్వీరాజ్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేశారు.

దుల్కర్, టొనినో థామస్ తదితరుల

దుల్కర్, టొనినో థామస్ తదితరుల

ఫృథ్వీరాజ్ క్షేమంగా ఇంటికి చేరుకోవడంపై మలయాళ సినీ ప్రముఖులు దుల్కర్ సల్మాన్, టొవినో థామస్, సనియా అయ్యప్పన్ తదితరులు విషెస్ అందజేశారు. తమ మిత్రుడు ఫ్యామిలితో మమేకం కావడంపై తమ ఆనందాన్ని పంచుకొన్నారు. ఇక ఫృథ్వీకి అభిమానుల నుంచి సందేశాల వెల్లువ కొనసాగుతున్నది. తనకు విషెస్ తెలియజేసిన ప్రతి ఒక్కరికి పృథ్వీరాజ్ ధన్యవాదాలు తెలిపారు.

Recommended Video

Chiranjeevi & Allu Arjun To Unite For Lucifer Remake
పృథ్వీరాజ్ కెరీర్ గురించి

పృథ్వీరాజ్ కెరీర్ గురించి

ఆడుజీవితం చిత్రానికి బ్లెస్సీ దర్శకత్వం వహిస్తున్నారు. బెన్యమిన్ అనే రచయిత రాసిన నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్నది. ఏఆర్ రెహ్మన్ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అమలాపాల్, అపర్ణ బాలమురళి, వినీత శ్రీనివాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక పృథ్వీరాజ్ దర్శకత్వం వహించిన లూసిఫర్ మలయాళంలో అతిపెద్ద విజయం సాధించిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X