twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రముఖ నటుడు కన్నుమూత.. సంతాపం ప్రకటించిన సీఎం

    |

    ప్రముఖ నటుడు, మలయాళ టెలివిజన్ యాక్టర్ రవి వల్లాతోల్ ఇక లేరు. శనివారం ఉదయం తిరువనంతపురంలోని ఆయన నివాసంలో కన్నుమూశారు. ఆయన వయసు 67 సంవత్సరాలు. ప్రఖ్యాత రంగస్థల నటుడు టీఎన్ గోపినాథ్ నాయర్ కుమారుడిగా, కవి వల్లాతోల్ నారాయణ మీనన్ మేనల్లుడిగా రవి సుపరిచితులు.

    మూడు దశాబ్దాల కెరీర్‌లో 50 చిత్రాల్లోనూ, అలాగే వందకు పైగా సీరియల్స్‌లోనూ నటించారు. మలయాళ చిత్ర పరిశ్రమలో పాటల రచయితగా, నటుడిగా ప్రవేశించిన ఆయన ఆ తర్వాత మలయాళ టెలివిజన్ రంగానికే పరిమితమయ్యారు. దాదాపు 25 సంక్షిప్త కథలు, కొన్ని నాటకాలు రాశారు. ఆయన రాసిన వేవతిక్కోరు పవక్కుట్టి నాటకం సినిమాగా తెరకెక్కింది.

     Actor Ravi Vallathol died in Thiruvananthapuram

    ఇక స్వాతి థిరునల్ చిత్రం ద్వారా రవి వల్లతోల్ నటుడుగా మాలీవుడ్‌లోకి ప్రవేశించారు. సైలెన్స్, రావణన్, ది డాన్, ఇంద్రియం, హిట్లర్ బ్రదర్స్, విష్ణుకోలం, సీజన్ చిత్రాల్లో నటించారు.

    అమెరికన్ డ్రీమ్స్ టెలివిజన్ సిరీస్‌లో ఆయన నటనకు కేరళ స్టేట్ టెలివిజన్ అవార్డు దక్కింది. 2011లో పారిజాతం సీరియల్‌లో నటించినందుకు గాను ఏషియా నెట్ అవార్డుల కార్యక్రమంలో ఉత్తమ నటుడి అవార్డును అందుకొన్నారు.

    రవి వల్లాతోల్ మరణ వార్త తెలిసిన వెంటనే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజజన్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తిం చేశారు. ఆయన కుటుంబానికి మనస్తైర్యం ఇవ్వాలని, అలాగే ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి ప్రార్థించారు. రవి మరణం కళా రంగానికి తీరని లోటని పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

    English summary
    Malayalam Actor Ravi Vallathol died in Thiruvananthapuram on Saturday, ie 25th April. He was aged 67 and survived by his wife Geethalakshmi. Kerala Chief Minister Pinarayi Vijayan has expressed his condolence over the death.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X