twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మోహన్‌లాల్‌పై నిప్పులు చెరిగిన నటి రేవతి.. సూపర్‌స్టార్‌కు ఎదురుదెబ్బ!

    |

    మీటూ ఉద్యమంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌కు విలక్షణ నటి రేవతి షాకిచ్చింది. లైంగిక వేధింపులపై బాధితులు వెల్లడిస్తున్న విషయాలను చులకన చేసి మాట్లాడటం తగదని మోహన్‌లాల్‌పై పరోక్షంగా రేవతి నిప్పులు చెరిగింది. ట్విట్టర్‌లో మోహన్‌లాల్ కామెంట్లపై అభ్యంతరం తెలుపుతూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళితే..

    హీరోయిన్లకు ఫ్యాషనైపోయింది

    హీరోయిన్లకు ఫ్యాషనైపోయింది

    మలయాళ చిత్రం పరిశ్రమలో లైంగిక వేధింపుల్లాంటి ఎలాంటి సమస్యలు లేవు. వాస్తవంగా మీ టూ ఉద్యమం ఉందని కూడా భావించడం లేదు. లైంగిక వేధింపుల ఆరోపణలు అత్యుత్సాహంతో చేస్తున్నారు. ఇలా చేయడం కొందరికి ఫ్యాషన్‌గా మారింది. జీవితం చాలా చిన్నది. అలాంటి జీవితంలో లైంగిక వేధింపులనేవి ఎప్పుడో ఎక్కడో జరుగడం సహజమే. సినిమాలకే పరిమితం కాదు అని మోహన్ లాల్ అన్నారు.

    <strong>మీ టూ ఫ్యాషనైపోయింది.. హీరోయిన్లకు చురక.. వివాదంలో మోహన్ లాల్.. </strong>మీ టూ ఫ్యాషనైపోయింది.. హీరోయిన్లకు చురక.. వివాదంలో మోహన్ లాల్..

    మోహన్‌లాల్‌పై ట్రోలింగ్

    మోహన్‌లాల్‌పై ట్రోలింగ్

    దుబాయ్‌లో జరిగిన మీడియా సమావేశంలో మోహన్ లాల్ మాట్లాడిన మాటలపై పలు వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సోషల్ మీడియాలో సూపర్‌స్టార్ భారీగా ట్రోల్ చేశారు. సూపర్ స్టార్ లాంటి వ్యక్తి ఇలా మాట్లాడటం తగునా అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే నటి రేవతి స్పందించారు.

    నటి రేవతి నిప్పులు చెరిగి

    నటి రేవతి నిప్పులు చెరిగి

    మోహన్‌లాల్ మాటలను ఉద్దేశించి రేవతి నిప్పులు చెరిగింది. మీ టూ ఉద్యమం కేవలం ఫ్యాషన్‌ కోసం చేస్తున్నారని ఓ ప్రముఖ నటుడు వ్యాఖ్యలు చేశాడు. అలా మాట్లాడే వారికి ఆ బాధలో ఉండే తీవ్రతను ఎలా చెప్పాలో అర్ధం కావడం లేదు. మార్స్ నుంచి వచ్చిన వారికి వేధింపులు అంటే ఏంటో తెలియదు. మహిళలు ఎదుర్కొనే ఇలాంటి సవాళ్లను ఇక ఎలా బయటపెడుతాం అని రేవతి ట్వీట్ చేశారు.

    మాటలకు కట్టుబడి ఉంటాను

    మాటలకు కట్టుబడి ఉంటాను

    ఇదిలా ఉండగా, మీ టూ ఉద్యమంపై తాను మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉంటాను. నేను మాట్లాడిన విషయంలో ఎలాంటి తప్పు లేదని భావిస్తున్నాను. నా దృష్టిలో మీ టూ ఉద్యమం శుద్ద దండుగ. అందులో వాస్తవాలు లేవు. అలా అయితే మహిళల వేధింపులపై పురుషులు కూడా మీ టూ ఉద్యమం చేపట్టాల్సిందే అని మోహన్ లాల్ అన్నారు.

    English summary
    Actor Mohanlal termed the MeToo movement a fad with a short lifespan during a press conference in Dubai. #MeToo as a movement is a fad and it’s turning into something of a fashion. In response to his statement, Revathi said, "#MeToo movement a 'FAD' says a renowned ACTOR. How do we bring some degree of sensitivity in such people?
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X