మలయాళ సూపర్‌స్టార్ సోదరుడి అరెస్ట్.. చీటింగ్‌ కేసులో రిమాండ్‌కు తరలింపు

మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడు సురేష్ గోపి సోదరుడిని కేరళ పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. తనను సురేష్ గోపి సోదరుడు సునీల్ గోపి చీటింగ్‌కు పాల్పడని ఓ వ్యాపారి చేసిన ఫిర్యాదు ఆధారంగా కోయంబత్తూరు జిల్లాకు చెందిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

సురేష్ గోపి సోదరుడి సన్నిహితులు తెలిపిన ప్రకారం.. సనల్ గోపి అలియాస్ సునీల్ గోపిపై తిరువల్లూరుకు చెందిన గౌండర్ మిల్స్ యజమాని, రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆర్ గిరధర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో డీసీబీ సబ్ ఇన్స్‌పెక్టర్ ఎన్ సంబంధం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అని తెలిపారు.

ఈ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కోయంబత్తరులోని ముదక్కరై తాలుకాలోని మావుతమ్ పత్తి గ్రామంలోని 4.52 ఎకరాల భూమిని అమ్మేందుకు తన ఫ్యామిలీ ఫ్రెండ్ వెంకటాచలం ద్వారా గిరిధర్‌ను సునీల్ సంప్రదింపులు జరిపారు. సునీల్‌తో చర్చల అనంతరం భూమిని కొనుగోలు చేయడానికి అంగీకరించి 97 లక్షల రూపాయలు అడ్వాన్సుగా ఆయనకు, ఆయన బంధువులు రీనా, శివదాస్ బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. నవంబర్ 24, 2021 రోజున భూమి రిజిస్ట్రేషన్ జరిగింది.

Actor Suresh Gopis brother Sunil Gopi arrested in Cheating case

అయితే తన పేరు మీద ఈసీ కోసం దరఖాస్తు చేసుకోగా.. కోర్టులో ఓ కేసు పెండింగ్‌లో ఉందనే విషయం తెలిసింది. ఆ తర్వాత డిసెంబర్ 25వ తేదీన ఈ విషయాన్ని సునీల్ దృష్టికి తీసుకెళ్లగా.. నెల రోజుల లోపున డబ్బు వాపసు ఇస్తానని గిరిధర్‌కు హామీ ఇచ్చారు. అయితే ఫిబ్రవరి 20 తేదీ వరకు కూడా ఎలాంటి పని జరగలేదు. డబ్బు వాపసు ఇవ్వకపోవడంతో మళ్లీ సునీల్‌ను గిరిధర్ సంప్రదించారు. అయితే గిరిధర్‌కు డబ్బు ఇవ్వకపోగా.. బెదిరింపులకు పాల్పడటం జరిగింది.

దాంతో సునీల్‌పై కోయంబత్తూరు జిల్లా క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు గిరిధర్ ఫిర్యాదు చేశారు. దాంతో సునీల్, రీనా, శివదాస్‌పై ఐపీసీ సెక్షన్ 120 (బీ), 406, 420, 471 కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో శనివారం సునీల్‌ను కోజికోడ్ నుంచి డీసీబీ ఇన్స్‌పెక్టర్ రాజేశ్వరి అరెస్ట్ చేశారు. అనంతరం జూడిషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడంతో ఆదివారం రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X