యువ నటుడి భార్య అనుమానాస్పద మృతి.. కట్నం కోసం చిత్రహింసలు.. మిస్టరీగా మారిన మరణం
మలయాళ నటుడు ఉన్నిరాజన్ పీ దేవ్ భార్య ప్రియాంక అనుమానాస్పద స్థితిలో మరణించడం మాలీవుడ్‌లో సంచలనం రేపింది. బుధవారం తమ నివాసంలో విగతజీవిగా ప్రియాంక పడి ఉండటం అనేక అనుమానాలకు దారి తీసింది. ఈ మరణం నేపథ్యంలో ఉన్నిరాజన్‌పై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. దాంతో ప్రియాంక కుటుంబ సభ్యులు ఉన్నిరాజన్‌పై పలు అరోపణలు చేశారు. దీంతో ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఈ మరణానికి అసలు కారణం ఏమిటంటే..

భార్యను హింసించిన ఉన్నిరాజన్
ప్రియాంక మరణం వెలుగులోకి రావడంతో ఉన్నికృష్ణన్‌పై కుటుంబ సభ్యులు ఆరోపణలు చేశారు. గృహ హింస కారణంగానే ఆమె బలవంతంగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. కట్నం వ్యవహారంలో ప్రియాంకను ఉన్నికృష్ణన్ దారుణంగా హింసించే వాడు. ఆమెను దారుణంగా శారీరక వేధింపులకు పాల్పడేవాడు. కొట్టడం, దూషించడం చేసేవాడు అని మీడియా కథనాల్లో పేర్కొన్నారు.

శారీరక హింసను భరించలేక పోలీసులకు ఫిర్యాదు
తొలుత భర్త పెట్టే హింసను భరిస్తూ కుటుంబ సభ్యులకు వెల్లడించలేదు. ఆ శారీరక హింస భరించ రాని స్థాయి దాటడంతో ఆమె వట్టప్పర పోలీస్ స్టేషన్‌లో భర్తపై ఫిర్యాదు చేశారు. ఉన్నికృష్ణన్‌పై కేసు నమోదు చేసిన మరుసటి రోజు ప్రియాంక ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం అనుమానాస్పదంగా మారింది.

ప్రేమించి.. పెళ్లాడిన జంట
మీడియా కథనాల ప్రకారం... ఉన్నిరాజన్, ప్రియాంక వ్యక్తిగత సంబంధాల్లోకి వెళితే.. వారిద్దరిది ప్రేమ వివాహం. కొన్నాళ్లు డేటింగ్ చేసిన తర్వాత పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత తన వ్యక్తిగత అవసరాలకు ప్రియాంక నగలు అమ్మడం మొదలుపెట్టాడు. ఉన్ని డిమాండ్ చేసిన కొద్ది ప్రియాంక తల్లి డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసేది. కానీ ఈ విషయాన్ని ఎక్కడా ప్రియాంక బయటపెట్టలేదు అని ఆమె బంధువులు వెల్లడించారు.

కట్నం డబ్బు కోసం వేధింపులు,
కట్నం డబ్బు తీసుకురావాలని, తన అవసరాలకు సొమ్ములు కావాలని డిమాండ్ చేస్తూ ప్రియాంకను ఉన్నిరాజన్ విపరీతంగా కొట్టేవాడు. ఉన్నిరాజన్ తనపై శారీరక దాడి చేసినప్పుడు కొన్ని వీడియోలు కూడా రికార్డు చేసింది. ఇటీవల ఆయన పెట్టే చిత్రహింసలను భరించలేకే ప్రియాంక బలవన్మరణానికి పాల్పడింది అని బంధువులు పేర్కొన్నారు.
Recommended Video

ఉన్ని రాజన్ ఎవరంటే..
నటుడు ఉన్నిరాజన్ విషయానికి వస్తే.. మలయాళంలో ప్రముఖ నటుడు, దివంగత రాజన్ పీ దేవ్ కుమారుడు. పవన్ కల్యాణ్ నటించిన ఖుషీ సినిమా ద్వారా రాజన్ పీ దేవ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులనే విషయం తెలిసిందే. 2019లో ప్రియాంకను వివాహం చేసుకొన్నారు. ఆడు ఓరు భీకరాజీవియను అనే చిత్రం ద్వారా మాలీవుడ్‌లోకి ప్రవేశించారు. ఇది, రాక్షాధికారి బైజు, మాంధరం, జనమైత్రి చిత్రాల్లో నటించాడు.


Click it and Unblock the Notifications











