twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహిళపై లైంగిక వేధింపులు.. ప్రముఖ నటుడి అరెస్ట్, వెంటనే బెయిల్, ఏం జరిగిందంటే?

    |

    మళయాల నటుడు వినాయకన్ మీద మృదులాదేవి అనే మహిళను లైంగిక వేధింపులకు గురి చేసినట్లుగా కేసు నమోదైంది. కేసు రిజిస్టర్ అయిన ఐదు రోజుల అనంతరం వినాయకన్ వాయనాడ్‌లోని కల్పెట్టా పోలీస్ స్టేషన్‌ల్లో గురువారం సరెండర్ అయ్యారు. వెంటనే పోలీసులు అతడిని అరెస్ట్ చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అనంతరం బెయిల్ మీద విడుదల చేశారు.

    యాక్టివిస్ట్ మృదులాదేవి జూన్ 3న వినాయకన్ వల్ల తాను ఎదుర్కొన్న ఫోన్ హరాస్మెంట్ గురించి ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. అయితే ఈ పోస్టుపై పలువురు సోషల్ మీడియా యూజర్లు స్పందిస్తూ ఆయనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నావంటూ ఆరోపించారు. దీంతో ఆమె కల్పెట్ట పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ చేసింది. జూన్ 15న పోలీసులు వినాయకన్ మీద కేసు నమోదు చేశారు.

    లాయర్‌తో కలిసి వచ్చిన వినాయకన్

    లాయర్‌తో కలిసి వచ్చిన వినాయకన్

    గురువారం వినాయకన్ తన లాయర్‍‌తో కలిసి పోలీస్ స్టేషన్ వచ్చారు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసినట్లు రిజిజస్టర్లో పేర్కొని, ఈ కేసు విషయంలో అతడి స్టేట్మెంట్ తీసుకున్నారు. కాల్పెట్ట పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు మాట్లాడుతూ... ఐపీసీ సెక్షన్ 294(బి), 509తో పాటు సెక్షన్ 120(ఓ)కేరళ పోలీస్ యాక్ట్, 2011 ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

    సున్నితంగా తిరస్కకించాను

    సున్నితంగా తిరస్కకించాను

    ఓ ఇంటర్వ్యూలో వినాయకన్ ఈ సంఘటన గురించి వివరిస్తూ... ‘ఓ కార్యక్రమానికి ఇన్వైట్ చేయడానికి తనకు ఒక వ్యక్తి కాల్ చేశాడని, అయితే నేను అతడి ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించాను. ఈ కార్యక్రమానికి రావాల్సిన బాధ్యత మీకు లేదా? అంటూ అతడు మాట్లాడటం మొదలు పెట్టాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది, తర్వాత ఒక మహిళ లైన్లోకి వచ్చింది. ఆమె ఎవరో కూడా నాకు తెలియదు. అతడితో జరుగుతున్న గొడవపై ఆమె మాట్లాడటం మొదలు పెట్టింది. అది మాత్రమే జరిగింది' అని వినాయకన్ చెప్పుకొచ్చారు.

    నాతో పాటు, నా తల్లి కూడా పడుకోవాలన్నారు

    నాతో పాటు, నా తల్లి కూడా పడుకోవాలన్నారు

    తన ఫేస్‌బుక్ పోస్టులో వినాయకన్‌, తనకు మధ్య ఏప్రిల్ 2018లో జరిగిన టెలిఫోనిక్ సంభాషణ గురించి మృదుల వివరించారు. ‘ నాకు వినాయకన్ అంటే చాలా రెస్పెక్ట్ ఉండేది. ఎందుకంటే 2017లో ఓ నటిని కార్లో తిప్పుతూ వేధింపులకు గురి చేసిన సంఘటనలో ఆమెకు అతడు సపోర్ట్ చేశాడు. కానీ అతడి యాంటీ ఉమెన్ యాటిట్యూడ్ రియల్ లైఫ్‌లో నేను ఫేస్ చేశాను. ఆ తర్వాత అతడిపై గౌరవం పోయింది. నేను అతడిని ప్రోగ్రాం కోసం ఇన్వైట్ చేశాను. నాతో పాటు, నా తల్లి కూడా అతడితో పడుకోవాలని కోరాడు. అదంతా నేను కాల్ రికార్డ్ చేశాను.' అని తెలిపారు.

    నేను అతడికి గతంలో సపోర్ట్ చేశాను

    నేను అతడికి గతంలో సపోర్ట్ చేశాను

    ఇదే పోస్టులో తాను గతంలో ఓ వివాదంలో అతడికి సపోర్టు చేసినట్లు మృదుల వెల్లడించారు. వినాయకన్ యాంటీ బీజేపీ స్టాండ్ వల్ల అతడిపై ఆన్‌లైన్లో ఎటాక్ జరిగినపుడు నేను అతడికి మద్దతుగా నిలిచాను అని గుర్తు చేసుకున్నారు.

    English summary
    Actor Vinayakan has surrendered in Kalpetta Police station for the sexual harassment complaint of Mruduladevi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X