హీరోయిన్ కారుపై కూలిన మెట్రో పైకప్పు.. తృటిలో తప్పించుకొన్న అందాల భామ!

మలయాళ హీరోయిన్ అర్చన కవి భారీ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకొన్నారు. రోడ్డు ప్రయాణిస్తుండగా కారుపై ఓ భవనం పైకప్పు కూలడంతో ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు ఎవరూ గాయపడకుండా సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పిల్చుకొన్నారు. ఈ ఘటనపై అర్చన కవి ట్విట్టర్‌లో స్పందించారు. అంతేకాకుండా కోచి పోలీసులకు, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు..

ఎయిర్‌పోర్టుకు వెళ్తుండగా..

అర్చన కవి ట్విట్టర్‌తో స్పందిస్తూ.. మేము ఘోర ప్రమాదం నుంచి తప్పించుకొన్నాం. మేము ఎయిర్‌పోర్టుకు వెళ్తుండగా మేము ప్రయాణిస్తున్న కారుపై మెట్రో రైలుకు సంబంధించిన పైకప్పు కూలి పడింది. ఈ ఘటనపై కోచి మెట్రో, కోచి పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఘటన కారణమైన వారిని శిక్షించాలి. డ్రైవర్‌కు నష్టపరిహారం ఇప్పించాలి. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగుకుండా చూసుకోవాలి అని అర్చన కవి ట్వీట్ చేశారు.

అర్చన కవి ట్వీట్‌పై స్పందన

అర్చన కవి ట్వీట్‌పై స్పందన

అర్చన కవి ట్వీట్‌పై మెట్రో అధికారులు స్పందించారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. డ్రైవర్‌తో మాట్లాడేందుకు చర్యలు తీసుకొంటున్నాం. కోచి మెట్రో బ్రిడ్జి భద్రతపై చర్చ జరుగుతున్నది. ఈ ప్రాజెక్ట్ ఎంత వరకు సురక్షితం అనే అంశంపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతున్నది. సోషల్ మీడియాలో మెట్రో కోచిపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

మెట్రో అధికారులతో పోలీసుల ఆరా

మెట్రో అధికారులతో పోలీసుల ఆరా

సినీ హీరోయిన్ అర్చన కవి ఫిర్యాదుతో కోచి పోలీసులు స్పందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి కారణంపై మెట్రో అధికారులను కలిసి ఆరా తీస్తున్నారు. కారు డ్రైవర్‌కు నష్టపరిహారం ఇప్పించేందుకు చర్యలు చేపట్టారు. భవిష్యత్‌‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నారు.

అర్చన కవి కెరీర్‌ గురించి

అర్చన కవి కెరీర్‌ గురించి

అర్చన కవి విషయానికి వస్తే, ఆమె హానీ బీ , పట్టాం పోల్, నాడోదిమనన్ చిత్రాల్లో నటించింది. తమిళంలో అరావాన్, జాన కిరుక్కన్ అనే చిత్రాల్లోను నటించింది. పలు కొత్త చిత్రాల్లో నటించేందుకు సంప్రదింపులు జరుగుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X