డ్రగ్స్‌తో పట్టుబడిన నటి... కస్టమర్ల కోసం వెయిట్ చేస్తుండగా అరెస్ట్ చేసిన పోలీసులు!
డ్రగ్స్ వ్యవహారంలో సినీ స్టార్లు గతంలో పట్టుబడిన సంఘటనలు చూశాం. కొందరు ఆయా కేసుల్లో అరెస్టయ్యారు. టాలీవుడ్లోనూ ఇలాంటివి చోటు చేసుకున్నాయి. తాజాగా మరోసారి డ్రగ్స్ వ్యవహారం సౌత్ సినీ ఇండస్ట్రీలో కలకలం రేపింది.
అశ్వథి బాబు అనే మలయాళ నటి డ్రగ్స్‌తో పట్టుబడింది. ఆమెను అరెస్ట్ చేసినట్లు తిక్కక్కరా పోలీసులు కన్ఫర్మ్ చేశారు. కొచ్చిలో ఆమె డ్రగ్స్ అమ్మడానికి కారులోరాగా పోలీసులకు దొరికిపోయినట్లు సమాచారం.

డ్రైవర్ బినయ్ అబ్రహంతో కలిసి
తన డ్రైవర్ బినయ్ అబ్రహంతో కలిసి అశ్విథి బాబు ఒక చోట కారులో వెయిట్ చేస్తుండగా అటుగా వచ్చిన పోలీసులు అనుమానం వచ్చి సోదాలు నిర్వహించారు. వారి వద్ద ఎండిఎంఏ అనే సింథటికర్ డ్రగ్ పట్టుబడింది.

లేట్ నైట్ పార్టీలో ఉపయోగించే డ్రగ్
ఎండిఎంఏ డ్రగ్ లేట్ నైట్ పార్టీల్లో ఉపయోగిస్తారు. ఆదివారం రాత్రి అశ్వథి బాబు...వాటిని కస్టమర్లకు అందించేలోపే పోలీసుల దృష్టిలోపడ్డారు.

ఆమె నివాసం సమీపంలోనే...
అశ్విథీ బాబు ఇంటి సమీపంలోనే పోలీసులు ఆమెతో పాటు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి అరెస్టును నమోదు చేయడంతో పాటు దీనికి వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే విషయమై దర్యాప్తు జరుపుతున్నారు.

టీవీ, సినీ నటి
తిరువనంతపురంకు చెందిన అశ్విథీ బాబు... మలయాళం ఇండస్ట్రీలో పలు సినిమాలతో పాటు, సిరియల్స్‌లో నటించారు.


Click it and Unblock the Notifications











