పడక గదిలోకి వస్తే ఆఫర్.. నా తల్లిపై కూడా.. మరో హీరోయిన్ ఆవేదన

సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల ఆరోపణలు ఇటీవల కాలంలో ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అందాల తారలకు ఆఫర్ల ఆశచూపి లైంగికంగా, శారీరకంగా వేధించే విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అదే కోవలో కాస్త ఆలస్యంగా.. లైంగిక వేధింపులకు గురైన కణి కసృతి అనే నటి విషయం బయటకు పొక్కింది. వివరాల్లోకి వెళితే..

నటి కణి కసృతికి చేదు అనుభవం

నటి కణి కసృతికి చేదు అనుభవం

విభిన్నమైన, విలక్షణమైన నటనతో ఆకట్టుకొంటున్న అందాల తార కణి కసృతికి కెరీర్ ఆదిలోనే చేదు అనుభవం ఎదురైంది. కాక్‌టెయిల్, షికార్ లాంటి చిత్రాల్లో అందం, అభినయంతో మెప్పించింది. తమిళంలో కూడా పిసావసు, బర్మా అనే చిత్రాల్లో కనిపించింది.

నటనకు స్వస్తి చెప్పడంతో

నటనకు స్వస్తి చెప్పడంతో

ఇక కేఎం సర్జున్ దర్శకత్వంలో వచ్చిన మా షార్ట్ ఫిలిం ద్వారా సినీరంగంలో మంచి గుర్తింపు తెచ్చుకొన్నది. ఆమె నటనకు అద్భుతమైన స్పందన వచ్చింది. మంచి నటిగా రాణిస్తుందని అనుకొంటున్న సమయంలో అనూహ్యంగా నటనకు స్వస్తి చెబుతూ కణి కసృతి షాకింగ్ నిర్ణయం తీసుకొన్నది. కారణమేమిటని ఆరా తీయగా లైంగిక వేధింపులని తెలిసింది.

పడక గదిలోకి వస్తే ఆఫర్

పడక గదిలోకి వస్తే ఆఫర్

మలయాళ మీడియాకు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కణి మాట్లాడుతూ.. ఓ చిత్ర దర్శక, నిర్మాతలు తమను శారీరకంగా సుఖపెట్టాలని కోరారు. పడకగదిలోకి పంపిస్తే ఆఫర్ ఇస్తామని నా తల్లిపై కూడా ఒత్తిడి తెచ్చారు. నేను ఒప్పుకోకపోవడంతో అవకాశాలు రాలేదు. జీవితం గడిచే పరిస్థితి లేకపోవడం వల్ల నటనను వదులుకొన్నాను పేర్కొన్నారు.

మీ టూ ఉద్యమం మంచి పరిణామం

మీ టూ ఉద్యమం మంచి పరిణామం

సినీ పరిశ్రమలో మీటూ ఉద్యమం ఊపందుకోవడం శుభపరిణామం. సినీ రంగంలో మహిళలకు కొంత మేలు జరుగుతుంది. కొందరైనా మారితే తారలకు న్యాయం జరుగుతుంది అని కణి వెల్లడించింది. కణి మాదిరిగానే మరికొందరు మహిళా నటులు ముందుకొస్తే పరిస్థితిలో స్పష్టమైన మార్పు కనిపించే అవకాశం లేకపోలేదు.

దక్షిణాదిలో లైంగిక ప్రకంపనలు

దక్షిణాదిలో లైంగిక ప్రకంపనలు

దక్షిణాది చిత్ర పరిశ్రమలో గాయని చిన్మయి శ్రీపాద, లీనా మణిమేకలై లాంటి సినీ తారలు కొందరిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేవారు. వారిలో హీరో అర్జున్, రచయిత వైరముత్తు, డైరెక్టర్ సుశీ గణేషన్ లాంటి వాళ్లు ఉండటం చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X